Saturday, September 1, 2012

ఓ తండ్రి లేఖ…

ఓ తండ్రి లేఖ… తనను వృద్ధాశ్రమానికి పంపించడానికి నిర్ణయం తీసుకున్నారని తెలిసిన ఒక తండ్రి తన కొడుకుకి రాసిన ఉత్తరం ఇది… బాబు ! నాకు వృద్దాప్యం వచ్చింది. నేను ఎంత కాలం ఈ భూమి మీద ఉంటానో నాకు తెలియదు. దయచేసి సహనం తో నన్ను అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించు. నీ బాల్యం నుంచి నీను నీకు ఎన్నో విషయాలు నేర్పాను. తినడం ఎలా? బట్టలు వేసుకోవడం ఎలా? జీవితాన్ని ఎదుర్కోవడం ఎలా? నేను అన్నం తినేటప్పుడు ఎంగిలి మెతుకులు పళ్ళెం చుట్టూ పడ్డా, బట్టల మీద మరకలు పడ్డా, బట్టలు సరిగా వేసుకోలేకపోయిన…నన్ను అసహ్యించుకోకు, చిరాకు పడకు: నీ బాల్యం నీవు ఈ పనులు చేయడానికి నీను నీకు గంటలు కొద్ది నేర్పిన రోజులు గుర్తు తెచ్చుకో. నీతో మాట్లాడేటప్పుడు ఒకే విషయాన్నీ వెయ్యిసార్లు చెప్పినా..నన్ను విసుక్కోకు. నీ చిన్నప్పడు నీవు నిద్రపోవడానికి ఒకే కధను మళ్లీ మళ్లీ వెయ్యిసార్లు విసుక్కోకుండా చెప్పిన సంగతి గుర్తు తెచ్చుకో! నీతో మాట్లాడే సమయంలో నా జ్ఞాపకశక్తీ తగ్గి, మాటలు సరిగా రాకపోవచ్చు. జ్ఞప్తికి తెచ్చుకోవడానికి నాకు సమయమివ్వు. ఒకవేళ జ్ఞాపకం రాకపోయినా విసుక్కోకు.నా వయసులో అతి ముఖ్యమైంది నీతో గడపడం కానీ, నా జ్ఞాపకశక్తి కాదు. ఎప్పుడైనా నా అలసిపోయిన కాళ్లు నడవనియ్యకపోతే నీ చేయి ఆసరాగా ఇవ్వు. నీవు మొదటి అడుగులు వేసేటప్పుడు..నా చేయి ఎలా సాయంగా ఇచ్చానో, నా చివరి అడుగులలో అలానే నీ చేయి ఇవ్వు. నా పక్కన ఉన్నప్పుడు అసహనంగా , కోపంగా విసుగ్గా ఉండకు. నీవు జీవించడం ప్రారంబించినప్పుడు నేను నీ పక్కన ఉంది నీకు సంరక్షణగా ఎలా ఉన్నానో .. నేను జీవితాన్ని చాలించేటప్పుడు పక్కనే ఉండి, నన్ను అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిచు. నా జీవితంలో నేను కొన్ని పొరపాట్లు చేసినా.. నా ప్రతి అడుగు నీకు అత్యున్నత స్థానం అరంభించాలనే నీకు సురక్షిత మార్గాన్ని వేయాలనే. నీ జీవితాన్ని ప్రేమ, సహనంతో ముగించే విదంగా నీవు సాయం చెయ్యి. నీవు ఈ ప్రపంచంలోకి వస్తూ ఎలా మా ముఖాల్లో నవ్వులు తెచ్చావో ఏదో ఒకరోజు నేను ఈ ప్రపంచాన్ని వదిలి వేల్లెతప్పుడే అదే చిరునవ్వుతో వేల్లిపోని . ఏదీ నీవు నాకిచ్చే అతి విలువైన బహుమానం. ప్రేమతో.. నాన్న!!

1 comment: