అక్షరాలు ధ్వనిస్తాయి, అక్షరాలు జ్వలిస్తాయి అక్షరాలు కదిలిస్తాయి, అక్షరాలు కరుణిస్తాయి అక్షరాలు అందంగా పొదిగితే గీతాల మాలికలవుతాయి, అక్షరాలగవాక్షాలౌతాయి సాహితీ పందిరికి తోరణాలై నిలుస్తాయి భాషకు, భావానికి నిచ్చెనలౌతాయి అక్షరాలు గుండె గుండెకు బాటలు వేస్తాయి ఎల్లలు తెలియని సీమలను కలిపివేస్తాయి అక్షరాలు అరుస్తాయి వేదనతో ఆనందంతో కేరింతలు కొడతాయి అక్షరాలు కవి గుండెల్లో కదులుతాయి......
Tuesday, September 18, 2012
ఎవరు ??
ఎవరు ??
బీడులు గా మారిన నా తెలంగాణా భూములకు రక్షణ ఎవరు ?
రైతన్న ల "కన్నీటి కథల" కు సాక్షులేవరు ??
"పురుగుల మందు" తో బలైన రైతన్న జీవితానికి బాధ్యులెవరు ???
దీనికి కారణం ఎవరు ? పరిష్కారానికి మార్గం ఎవరు ??
మగ్గాలు నేసే నేతన్నలు తన మగ్గాలనే "ఉరి " పగ్గాలుగా మార్చుకుని
బలవుతున్న "ఆకలి కేకల" చావులకు కారకులెవరు ?
ప్రాణాంతక గనుల నుండి "నల్ల బంగరాన్ని" తీస్తూ
ప్రాణాన్ని దేవుడి పై మొపుతున్న బొగ్గుబాయి "బొగ్గన్న" కు దిక్కు ఎవరు ??
దీనికి కారణం ఎవరు ? పరిష్కారానికి మార్గం ఎవరు ??
కరవు రక్కసికి తల్ల డిల్లీ ,బంధాల్ని విడిచిపెట్టి యేడేడు సముద్రాలు దాటి
"ఎడారి" దేశాలకు వస్తున్న గోస బతుకులకు ఆసర ఎవరు ?
డొక్క చిక్కి లొట్ట పోయిన నా తెలంగాణా జల్లెడ బతుకులకు "జిమ్మదారు" ఎవరు ??
దీనికి కారణం ఎవరు ? పరిష్కారానికి మార్గం ఎవరు ??
కన్నీళ్లతో....... ఓ తెలంగాణా పోరగాడు ,గుండాల
జై తెలంగాణా !
జై జై తెలంగాణా !!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment