Monday, November 26, 2012

వాన చిత్రంలోని డైలాగ్‌

వాన చిత్రంలోని ఈ డైలాగ్‌ చూసిన ప్రతి ప్రేమికుడి గుండెలోంచి పుట్టేవే.

వర్షం పడుతూ ఉంటుంది. చెరువు ఒడ్డున అభి బాటల్‌ ఎత్తి దింపి వెనక్కి తిరిగి చూడగానే.. నందిని. తర్వాత నందినిని చూసి
అభి : తాగితే అందంగా ఉన్నావ్‌.
నందిని : నేనేం తాగలేదు
అభి : నువ్వ కాదు నేను తాగితే
నందిని : సరె పదా టైమ్‌ అయ్యింది.
అభి : టైమా? టైమ్‌ ఒక పెద్ద 420. నిన్ను చూడగానే నా టైమ్‌ బాగుందనుకున్న. నువ్వు నాతో ప్రేమలో పడే టైమ్‌ వస్తుందనుకున్న. నీతో పెళ్లయి డజన్‌ మంది పిల్లల్ని కనే టైమ్‌ వస్తుందనుకున్న. రాలా.
నువ్వు నన్ను గట్టిగా హత్తుకుని ఈ లోకంలో నువ్వు తప్పా నాకెవ్వరు లేరని చెప్పె టైమ్‌ వస్తుందనుకున్నా. రాలా.
ఎవర్ని తిట్టాలి. ఆయన్నా.. (ఆకాశం వైపు చూస్తూ) పాపం ఆయన చేసిన తప్పేం ఉంది. నన్ను తీసుకెళ్ళి బాగా డబ్బున్న ఇంట్లో పడేశాడు. ఏ నేనుకూడా మా నాన్నలాగే డబ్బునే ప్రేమించొచ్చుకదా? నిన్నే ఎందుకు ప్రేమించాలి. ప్రేమించాను ఏమయ్యింది. నిన్ను చూడగానే డమాలునా బురద గుంటలో పడ్డా. అంటే ప్రేమనే గోతిలో పడ్డావు జాగ్రత్తరా అన్నాడు దేవుడు. వినాలిగా విన్లా .. అయినా వెదికా కనిపడ్దావ్‌ మాయమయ్యావ్‌. కనపడ్డావ్‌ మాయమయ్యావ్‌. అంత దేవుడు కల్లో కనిపించకుండానే చెప్పేసాడు. ఒరే ఈ పిల్ల నీ జీవితంలో మెరుపులా మాయమయ్యేదే కానీ చినుకులా నీ ఇంట్లో ఉండేది కాదురా అని.
తప్పెవరిది...నాది. ఏం చేయాలి? మర్చిపోవాలీ.
చేస్కో పెళ్లి చేస్కో..కాపురం చేస్కో పిల్లల్ని కను కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నా
ఈ లోకంలో నేను ప్రేమించినంతగా నిన్ను మరెవ్వరూ ప్రేమించలేరు.
నువ్వెక్కడున్నా.. ఎలాఉన్నా.. శ్హనన్ను మర్చిపోయినా.. ముసల్దానివై పోయినా. చచ్చి పోయినా.. నీమీద నా ప్రేమ చావదు. (బాటిల్‌ వైపు చూస్తూ) ఖాలీయే. కానీ ఇక్కడ ఖాలీగా లేదు (హృదయం).
నీ నవ్వు..నీ అందం నీ సిగ్గు నీ వయసు ఈ గజ్జల శబ్దం ఆ వాచీ..ఆ రాస్కెల్‌ దేవదాస్‌గాడి గంటె శ బ్ధం ..అన్నీ మిక్స్‌ అయ్యి నన్నురిపేర్‌ చేయలేనంతగా గాయం చేసి బాధ పెడుతున్నాయి.
బ్రతికేస్తా..అయినా బ్రతికేస్తాను.
నీతో గడిపిన ఈ నాలుగు రోజులు చాలు నాకు
ఆ జ్ఞాపకాలతో మిగిలిన జీవితం గడిపేస్తాను.
(కార్‌లో ఉన్న తన పెంపుడు కుందేలు వైపు చూస్తూ) రేయ్‌ దావదాసు, పదరా టైమ్‌ అయ్యిందటా ( ఇందలోనే అభి నీళ్లలో జారి కింద పడతాడు. వెంటనే నందిని చేయి అందిస్తుంది)
అభి : వద్దులే..వద్దులే.. ఒక్కసారి చేయిస్తేనే ఇంత వరకు వచ్చింది. ఇంకోసారి ఏమౌతుందో. వద్దులే ( గొడుకు పడుతుంది నందిని)
అభి : నిండా తడిసినోడికి గొడుగుపడుతున్నావా.. వద్దులేమ్మా. వెళ్లమ్మా వెళ్లు.
 
ఈ వానలో నను తడవని..ఈ వానలో నను తడవని
ఈ వానలో నను తడవని..

ప్రేమ

ప్రేమంటే పెదాలు పలికే పదాలు కావు
పెదాలు సైతం పలకలేని భావాలు 


Sunday, November 25, 2012

మధురం

మెరుపులా తాకింది నీ చూపు
కరిగిపోతానంటున్న మనసును కరడుగట్టించేదెలా...?


చివురుల్లో దాగిన మొగ్గలా
నన్ను నీలో దాచేస్తుంటే
నీ అపురూపం చూసి మురిసిపోతున్నాను.

మన్నుని తడిపి జీవం పోసే వానలా
నుదురు వంచి ముద్దులాడిన
నీ అనురాగం చూసి పొంగిపోతున్నాను.

పెనుతుఫానులా
నన్ను చుట్టుకుపోతుంటే మాత్రం
కంగారుపడుతున్నాను... ఎందుకని...?

నీ సాహచర్యంలో
ఈ కంగారయినా
మధురంగానే ఉంది... ఎందుకని...?

Saturday, November 24, 2012

అదృశ్య ప్రేయసి......

నాకెప్పటికీ
అర్థం కాని విషయం...
ఒక రహస్య సంబంధంలా
అనిపిస్తుంది
ఏదో ఇంద్రజాలంలా..
భావగర్భితంగా..
శ్రావ్యమైన సంగీతంలా..
నను వెంటాడుతూ
వేటాడుతూ
కనిపించకుండా నా చుట్టే తిరుగుతూ
గాల్లో పరిమళాలు వెదజల్లుతూ...
ఏంటోమరి ఈ అనుబంధం
ఏనాటిదో ఈ బంధం
తను నా దరిదాపులోకి వస్తే
నాకిట్టే తెలిసిపోతుంది
ఆ అడుగుల సవ్వడి నాకు గురుతే
ఆ మల్లెల సౌరభం నాకు ఎరుకే
తనిక్కడే ఎక్కడో వుంది
నన్నే చూస్తుంది
నా అంతరంగ తరంగాలను
తప్పించుకొని ఎక్కడికీ పోలేదు!

నా శ్వాసలో నిన్ను దాచేయనా!!!

                                               నా నవ్వులు నీకు పంచాలని
నా కలలో నిన్నే చూడాలని
చుక్కలన్ని నీ ముంగిట దింపాలని
నా ప్రతీ పదము నీకె అంకితమివ్వాలని
నా సంతోషం లో నువ్వే నిండి ఉండాలని
నీ చిరునవ్వులో నీ పెదవి వొంపునవ్వాలని
ఎనాటికీ నిన్ను వీడిపొవద్దని
నా మనసుని నీకే అర్పించాలని
నీతోనే కలిసి పయనించే బాటసారిని కావాలని
నీ కోరికలో ప్రేమనై
నీ ప్రేమలో స్వార్ధమై
నీ కళ్ళలో ప్రతీ రూపాన్నై
నీ గుండెలో గానమై
నీ అడుగులో ధూళినై
నీ మాటల్లో పలుకునై
నీ చూపులో వెలుగునై
నీ కవితలో భావన్నై
నీ మేనికి ఛాయనై
నీ వెంట నీడనై
నీ ఆశకి బదులవ్వనా...
నా శ్వాసలో నిన్ను దాచేయనా!!!

Wednesday, November 21, 2012

నీ తోడు కావాలి..

శూన్యపు పొరలు చుట్టేసినపుడు జాబిలి వెలుగులు పంచే ఓ తోడు కావలి..

మౌన వీదుల్లో తిరుగులాడేటప్పుడు ఆనందాన్ని ఇచ్చేటందుకు ఓ స్నేహం కావాలి..

సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతుంతే వెనుక నిలబడి నేనున్నా అని బరొసా ఇచ్చే నేస్తం కావాలి..

జీవిత ఒడిదుదుకులతో అలసిపొయినప్పుడు గతంలో గడిచిన ఓ మధుర స్వప్నం కావాలి..

వృద్దాప్యపు చాయలతో ఒంటరివై నిలచినపుడు నీడలా వచ్చే ఒక జ్ఞాపకం కావాలి..

అతివ.............

యుగాలేన్ని సాగినా ఆగదు ఈ మృత్యుకేళీ  ...
మగువను విషనాగై మింగే వైకుంటపాళీ ....
కరుణలేని సమాజాన తరునికేది స్థానం ..
అడుగు కదపనివ్వని బడభాగ్ని పంజరం ....
తల్లి కడుపు నుంచే వెంట తెచ్చుకుంది ఆడపిల్ల అర్ధంతరపు మరణ శాసనం ...
అతివకు చితిమంటలే అత్తిల్లవుతున్నా నరలోకం నరకులకే నట్టిల్లవుతున్నా ....
నీవు కూడా స్త్రీ వేగా నేలమ్మా....సహనం చాలించి పగిలిపోవమ్మా...
నాటి ఒక్క సితతో ఆగలేదు జ్వాలలు  నేటి వరకు సమిధలే కోటి కోటి సితలు ...
ఎపుడు పుడతాడో మరో వాల్మికి .....
ఎపుడు మారుస్తాడో ఈ నీతి .....

Tuesday, November 20, 2012

ఆమె వెళ్ళిపోయిన రోజు???



ఆమె వెళ్ళిపోయిన రోజు
నా ముఖాన మసిపూసుకున్నాను
కౄరమైన పిచ్చిగాలి చెంప పగులగొట్టాను
ముక్కలైన జీవితాన్ని చేతికెత్తుకున్నాను
పగిలిన అద్దం ముందు నగ్నంగా నిలిచాను
నా మీద నాకే ఆవేశం
హుందాగా సూర్యుడ్ని "మూర్ఖుడా" అని తిట్టాను
రంగుల లోకపు వైతాళికులకు వెతికివెతికి "థూ" అన్నాను
తూర్పునుండీ పడమరకు చెప్పులులేకుండా నడిచాను
దారిలో పడి ఉన్న కంకరరాళ్ళను మీద చల్లుకున్నాను
విభ్రమ స్ఫూర్తితో కొండకోనల్ని చీల్చిపారే నీటికి
ఏ సముద్రం చేరే కోరికో?
లేదా,మందగతిన ఇసుక ఒడిలో కూరుకుపోయే నిర్వేదమో
నాలోనేను లేనన్నది ప్రశ్న
ఇక ఆమెకళేబరాన్ని అక్కునచేర్చుకుని రోదించేదెట్లా?
ఆమె వెళ్ళిపోయిన రోజు
నా ముఖాన మసిపూసుకున్నాను


మరాఠీ మూలం: నామ్ దేవ్ ఢపాళ్
ఆంగ్లానువాదం: దిలీప్ చిత్రే
తెలుగుసేత: హరీష్. జి.



(హృద్యమైన కవితను అనువదించిన  మితృడు హరీష్ కు అభినందనలు. )

Monday, November 19, 2012

పిల్లలపై పందాలు కాయకండి !

అమ్మ ఒడిలో ఆడుకున్న బాల్యం
నాన్న భుజాలపై ఊరేగిన బాల్యం
అక్షరాలూ దిద్ది  బడిలో ఆడుకున్న బాల్యం
రెక్కలు తొడిగి నింగిన గాలి పటమై ఎగిరిన బాల్యం
చందమామతో స్నేహం చేసి వెన్నల నవ్వులై విరిసిన బాల్యం
నేడు ఓ జ్ఞాపకమేనా ..
కుల మతాలు లేకుండా పంచుకున్న కాకి ఎంగిళ్ళు
ఆడా మగా తేడాలేకుండా గిచ్చుకున్న ఆటల ముంగిళ్ళు
పిల్ల కాల్వల వెంట లేగ దూడలై ఎగిరిన గంతులు

నేడు ఓ తీపి గురుతేనా !
అప్పటి బాల్యం ఓ బంగారు ప్రపంచం ..
నెమరేసుకుంటే చెమర్చిన కళ్ళను అడుగు
జ్ఞాపకమై మెరిసిన ఇరుగు పొరుగును అడుగు
అక్కడే ఆగిపోయింటే ఎంత బాగుండేదని అంటాయి
స్వచమైన మనసుల నడుమ
స్వేచ్చగా మసలిన ముక్కుపచ్చలారని బాల్యం
బతుకు బందీఖానాలో నేడు బిక్కు బిక్కు మంటోంది
మనం కోల్పోయిన బాల్యాన్ని మన పిల్లల కిద్దాం
పిల్లల్ని పుస్తకాల పురుగులు చేయకుండా
అచ్చమైన మనుషులుగా స్వచంగా పెంచుదాం
నేటి యాంత్రిక  యుగంలో యంత్రాలుగా పిల్లల్ని చూడకండి !
నేటి పోటీ ప్రపంచంలో పిల్లలపై గుర్రపు పందాలు కాయకండి !

Sunday, November 18, 2012

ఈ లోకాన్ని వదిలేసా...!!

గుండెల్లో దాగున్న చేదు నిజాలకు

బదులు వెతకలేక క్షణ కాలం మనసులో

నిదురించ కళ్లల్లో కదిలే జ్ఞాపకాల కలలన్నీ

మరువలేక కన్నీటి రోధనను విలపించి ......



వేడుక చూపి వంచించిన మనిషిని....
మార్చలేక విధి రాతకి తల వంచి....

మరో వాడితో కాలం గడపలేక
మదిలో....

మిగిలిన చివరి రూపం చెరపలేక సాగుతున్న.....
కడసారి ఈ కవితని నీకూ అంకితం చేస్తున్నా.....
నీ చోటు ఎవరికి ఇవ్వలేక ఈ లోకాన్ని వదిలేసా...!!

నీ ఎడబాటు........


చిరు నవ్వులతో చేరువై....
చిరు మాటలతో దగ్గరై......
నువ్వులేని నేను.....
లేనని అనిపించావు....!!
నీ స్నేహం శాశ్వతం అనుకున్న
నాకు జ్ఞాపకాల్ని గమ్యం చేసి...
ఎడబాటుని వంతెన వేసి....
గతాన్ని పిడకలగా మిగిల్చి....
నువ్వు దూరం అయినా....



కానీ నేస్తం నీ ఆలోచనలలో....
జీవిస్తున్న మనసుకి, నీ ధ్యాస లో
కరిగిపోతున్న కన్నీరు ప్రతిక్షణం
నిన్ను గుర్తుచేస్తునేవుంది.....

జన్మంతా ఇక నిరీక్షణలే.....

పడీ లేచే కెరటాలు చేసే శబ్ధాలు అందరికి వినిపిస్తాయ్

కానీ కంటి నుండి కారే కనిట్టి శబ్దం ఎవరికీ వినిపించదు 

ఒక్క గాయపడ్డ హృదయానికి తప్ప ,




అ కన్నీరు చేసే శబ్దం ఎంత ఎక్కువ అంటే 

కొన్ని వందల సముద్రాలలో పుట్టే కెరటం అంత ఉంటుంది 


కానీ చిత్రం ఏంటి అంటే అది ఎవరికీ వినిపించదు

దాని గుండెలో దాచుకునే హృదయనకి తప్ప.........

నాకు నేనే జన్మదిన శుభాకాంక్షలు


డియర్ ఫ్రెండ్స్......నేను పుట్టి రేపటికి 25 సంవత్సరాలు పూర్తిచేసుకొని 26వ వసంతంలోకి  వెల్లబోతున్నాను.
అందుకు ముందుగా నాకు నేనే జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.....
ఈ 25 వసంతాలలో, నేను నా జీవితంలో ఒక పెద్ద పాటం నేర్చుకున్నాను, అదేంటంటే......

మామూలు మనిషిగా వుండడం ప్రపంచంలో అతి కష్టమయిన విషయం.

అసాధారణంగా వుండాలనే అందరూ అనుకుంటారు.
అజ్ఞాతంగా వుండిపోవాలని ఎవరూ అనుకోరు.
మన గురించి పదిమందీ చెప్పుకోవాలని మనుషులు కోరుకుంటారు.
ప్రత్యేకత కోసం పరుగులు పెడతారు.
జీవితంలో మౌనమ్, నిశ్శబ్దం నిర్మలత్వం ముఖ్యమయినవి.
అవి వున్నవాళ్ళలో దైవత్వముంటుంది. వాళ్ళకు ప్రచార ఆర్భాటాలు వుండవు. జీవించడం ఒక్కటే వాళ్ళకు తెలుసు.


ఒకరోజు నేను మా ఊళ్ళో అడవిలోకి వెళ్లాను. అక్కడ చెట్లు కొడుతున్నారు. కానీ మధ్యలో ఒక పెద్ద వృక్షం వుంది. అది విశాలంగా వ్యాపించి వుంది. దానికింద వంద బళ్ళు నిలబడవచ్చు. అన్ని చెట్లను కొడుతున్నా వాళ్ళు దాని జోలికి వెళ్ళడంలేదు. నేను వాళ్ళతో ‘ఇన్ని చెట్లుకొడుతున్నారు కదా. మరి ఆ పెద్ద చెట్టును ఎందుకు కొట్టరు?’ అని అడిగాను. దానికి వాళ్ళు ‘మేము కొడుతున్నవి టేకు మొదలైన ప్రశస్తమైన చెట్లు. వాటివల్ల ఎంతో ప్రయోజనముంది- వాటితో తలుపులు, బల్లలు, కుర్చీలు చెయ్యవచ్చు. ఈ పెద్ద చెట్టు మామూలు చెట్టు. దీని ఆకులు జంతువులు తినవు. దీని కట్టెలు కాలిస్తే విపరీతమైన పొగ వస్తుంది. దీంతో కుర్చీలు లాంటివి చెయ్యలేం. పెళుసుగా వుంటుంది. అందుకని ఎందుకూ పనికిరాని దీని జోలికి పోము’ అన్నారు. అప్పటినించీ నేను ప్రత్యేకత లేకుంటే ఎవరూ మనల్ని పట్టించుకోరు,  పైకి వెళ్ళాలనుకున్నవాళ్ళకి, పేరు సంపాదించాలనుకున్న వాళ్ళకి డబ్బు పట్ల ఆశవున్నవాళ్ళకి సవాలక్ష సమస్యలున్నాయి. సంక్షోభాలున్నాయి. నిజానికి జీవించడానికి వాటన్నిటితో ఏమీ పని లేదు. అందుకని నేను అజ్ఞాతంగా, సాధారణంగా వుండిపోవలనుకున్తున్నాను...

మనసు పలికే - అందాల రాక్షసి

మనసు పలికే భాష ప్రేమ 
మౌనమదిగే భాదులు ప్రేమ 
మరణ మైనా తోడు ప్రేమ
మనకి జరిగే మాయ ప్రేమ ....

గుండేలో వ్యధలనే  కాల్చు మంటే  ప్రేమ 
రగిలినా సె గలనే అర్పునది ఈ ప్రేమ
ఆదియు అంతము లేని పయనం ప్రేమ 
వేకువై చేరువే చీకటింట్లో ప్రేమ 
విశ్వమంతా ఉన్న ప్రేమ 
ఇరుకు ఎదలో దాచగలమా...
కాటిలో కాలదు తుదిలేని ఈ ప్రేమ 
జన్మనే కోరదు అమ్మేరుగదీ ప్రేమ 
దొరకదా వెతికితే కదలిన కన్నిట 
తరమగా దాహమే నీరల్లె ఓ ప్రేమ 
నీడ నిచ్చే వెలుగు తోడు 
చీకటైతే ఏమికాదు ....

ప్రేమ...

గుండెల్లో దాగుండేది గుర్తుండిపోయే ప్రేమ...
కళ్ళలో దాగుండేది కనుమరుగావని ప్రేమ...
మనసులో దాగుండేది మధురమైన ప్రేమ...
నామన్సున దాగుండేది నిజమైన ప్రేమ...

Saturday, November 17, 2012

కవిత్వమూ,...ఓ సందేహమె......

రాసేదంతా కవిత్యమేనా?
అని సందేహమెందుకు,....
కాకపోనూవచ్చు, భయమెందకు మిత్రమా......
ఉబికి వచ్చే అక్షరాన్ని,
గొంతు నులిపి , అనుమానంతో,
అనవసరంగా, చంపడం ఎందుకు,
తరువాత తీరిగ్గా,
ఏడవడమూ ఎందుకు.,..


భావాలతో అక్షరాలకు,
లంకె కుదరక, కనెక్టివిటి కోసం,
గిలగిలలాడుతున్నావా,
అదే ఓ కవి జననమని గుర్తుంచుకో నేస్తమా...

బొడ్డుడని బిడ్డ బాధ,
ఏ ఎదిగినోడికీ అర్థమూ కాదు,
తలనెరిసినవాడి తాత్వికత,
పురిటి కంపుని ఆపనూలేదు.
దేనికవే సమాంతరాలు,
అటునుంచి ఇటు దూకేదాక,.


కళ్లూ చెవులే కాదు,
ఇక్కడ పనిచేయాల్సింది,
నిన్ను నీవు తెరుచుకొని,
లోపలి అగాధాలలో అన్వేషించుకో,

నిర్భయంగా అక్షరమైపో,
అజరమరామై మిగలడానికి,
నిలకడగా రాసుకుపో,
నువ్వు నువ్వుగా నిలబడటానికి,
అది చాలు కవిత్వానికి,


ఇక వ్యాఖ్యలంటావా,,
పైకి లాగే వాడే పామై కరవావచ్చు,
క్రిందికి నెట్టెవాడే, నిచ్చనై మిగలావచ్చు.

కవిగా మిగుల్తావో,
కనుమరుగైపోతావో,
అది మరో పార్శ్వం,
కొద్ది మందికి మాత్రమే సాధ్యమయ్యే గొప్ప కళ,
కవిగా మిగలడమూ, వెలగడమే ....

Friday, November 16, 2012

నా ప్రపంచం నీ స్నేహం ...


దేవుడు మనిషి జీవితం లో పూర్తి ప్రేమతో ఒక వ్యక్తి ఉండాలని అనుకున్నాడు.
అందుకనే "అమ్మని" తయారు చేసాడు..

మనిషి జీవితం లో పూర్తి సహాయం, బాద్యత తో ఒక వ్యక్తి ఉండాలని అనుకున్నాడు.

అందుకనే "నాన్నని" తయారు చేసాడు..

మనిషి జీవితం లో పూర్తి సహాయంగా ఒక వ్యక్తి ఉండాలని అనుకున్నాడు.

అందుకనే "అన్నయ్యని" తయారు చేసాడు..

మనిషి జీవితం లో ఆట పాటలు సంతోషాలు ఉండాలని అనుకున్నాడు.

అందుకనే "చెల్లిని" తయారు చేసాడు..

ఇంక ఇవన్ని లక్షణాలు ఉన్న ఒక వ్యక్తికి ఉండాలని దేవుడు అనుకున్నాడు.

అందుకనే "స్నేహితున్ని" తయారు చేసాడు..

నా ప్రపంచం నీ స్నేహం ...


అది నువ్వే....

సముద్రం దగ్గరకు వెళితే అలలు అమ్మాయిల దగ్గరకు వెలితే కలలు మాత్రమే మిగులుతాయి

సముద్రం దగ్గరకు వెళితే అలలు 
అమ్మాయిల దగ్గరకు వెలితే కలలు 
మాత్రమే మిగులుతాయి 

నవ్వితే కన్నీళ్ళు రాలతాయి కానీ ఏడిస్తే రాలవు

Thursday, November 8, 2012

క్యా మిడి కవితా...


నీరు మనకెందుకీ పోరు
ఆపుదామా ఈ వారు
నిన్ను చూస్తే ఏదో కంగారు
అయిన తెలియని ఉషారు .

ముద్దిస్తావా ముమ్మారు
నిన్ను ఎక్కిస్తా బెంజి కారు
అందుకే చెబుతున్నా ఓ మారు
నువ్వంటే నాకు ప్యారు ………

వేదన


క్షణం  కూడా గడవడం లేదు……. నన్ను వెంటాడే చూపులు లేకపొతే
అడుగు తడబడుతుంది……… నన్ను నడిపించే పాదం దూరమౌతుంటే


మాట మూగబొతోంది…….. నీ మాట కరువౌతుంటే
హ్రుదయం స్పందించడం లేదు……… ప్రతిస్పందన లెకుంటే........

Wednesday, November 7, 2012

మాతృమూర్తి నీకు జోహారు.....


చీకటే నిను కమ్మినా వెలుగు చూపించావులే..
కాలమే కాటేసినా దారి చూపించావులే..
ఎదుట ఉన్నట్టే నువ్వు ఉంటావు...
మరచిపొలేని గురుతు నీదేలే...
ఓ నేస్తమా....మా ప్రాణమా!!!
ఎంత కాదన్నా నిన్నే మరవలేమమ్మా...
నీ జ్ఞాపకాలన్ని తలిచేము...గుండెలోతుల్లొ నిన్నే దాచుకున్నాము..
నీ గుడిగా మలిచాము మా హృదయం....
నువ్వు లేకుంటే మాకు తొడు ఎవరమ్మా...
నువ్వు రాకుంటే ఈ పాదం కదలదమ్మా...
స్నేహామా..చేరుమా...నీకిదే న్యాయమా???
అమర జ్యొతిగా మారినా మాతృమూర్తి నీకు జోహారు.....
నిన్ను తలచుకుంటే కంటి నిండా పొంగే కన్నీళ్ళు..
నువ్వు పుట్టినా నీఊరు నిను తలచి  ఏడ్చింది...
నువ్వువస్తావని పగటికలలేన్నో చెప్పింది..
వినరావా...కనరావా...
స్నేహామా..చేరుమా...నీకిదే న్యాయమా???