అక్షరాలు ధ్వనిస్తాయి, అక్షరాలు జ్వలిస్తాయి అక్షరాలు కదిలిస్తాయి, అక్షరాలు కరుణిస్తాయి అక్షరాలు అందంగా పొదిగితే గీతాల మాలికలవుతాయి, అక్షరాలగవాక్షాలౌతాయి సాహితీ పందిరికి తోరణాలై నిలుస్తాయి భాషకు, భావానికి నిచ్చెనలౌతాయి అక్షరాలు గుండె గుండెకు బాటలు వేస్తాయి ఎల్లలు తెలియని సీమలను కలిపివేస్తాయి అక్షరాలు అరుస్తాయి వేదనతో ఆనందంతో కేరింతలు కొడతాయి అక్షరాలు కవి గుండెల్లో కదులుతాయి......
Thursday, November 8, 2012
వేదన
క్షణం కూడా గడవడం లేదు……. నన్ను వెంటాడే చూపులు లేకపొతే అడుగు తడబడుతుంది……… నన్ను నడిపించే పాదం దూరమౌతుంటే మాట మూగబొతోంది…….. నీ మాట కరువౌతుంటే హ్రుదయం స్పందించడం లేదు……… ప్రతిస్పందన లెకుంటే........
No comments:
Post a Comment