Tuesday, December 25, 2012

ఓ ప్రేమ లేఖ............

ఓ ప్రియతమా, 
నా జీవితంలో నీవెంత ప్రధానమో నీకు చెప్పాలనుకుంటున్నాను. నీ చేతిని నా చేతిలో తీసుకుని, నీ కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తూ చెప్పాలనుకుంటున్నాను. కానీ మనిద్దరి మధ్య వ్యాపించి ఉన్న మైళ్ల కొద్ది శూన్యం, దూరం లేఖలో నా హృదయాన్ని వెల్లడించేలా చేస్తొంది.
నువ్వెలా విరహంతో తపిస్తున్నావో..నేనూ అలాగే జ్వలిస్తున్నాను. ఇలాంటి అనేక సందర్భాలు జీవితంలో మనను పరీక్షించేందుకు వస్తుంటాయి.మన ప్రేమకు కూడా ఇది టెస్ట్‌ లాంటిది.
ఇంతకు ముందే మనం మన ప్రేమని దూరం చేసుకునేందుకు ప్రయత్నించాము. కానీ ఒక్కటి మాత్రం నిజం ఎంతగా దూరం అయ్యామో అంతే దగ్గరయ్యాము. ఈ సిద్ధాంతం ఏంటో శాస్తవ్రేత్తలు కూడా కనుక్కోలేరు.నీ ప్రతి ఆలోచన నాకు నా ప్రాణం కన్నా ఇష్టం. నీ ప్రతి మాట నా మెదడులో చెరగని ముద్ర వేసుకుంది. నీ జ్ఞాపకాలలోనే జీవితాంతం ఉండాలనుకుంటున్నాను. కానీ నువ్వు దగ్గరైతే నీ జ్ఞాపకం ఎందుకు నాకు. నాకు మన జ్ఞాపకాలతో పనిలేదు. నువ్వు కావాలి. భౌతికంగా దూరంగా ఉండటం కన్నా భౌతికంగా లేక పోవడమే మేలనిపిస్తుంది నాకు.
మనం కలిసేంత వరకు మన మధ్యలో ఈ ప్రేమలేఖ మన ప్రేమను, మన కౌగిలిని మరపురాని అనురాగాన్ని మోసుకొస్తుంది.ఈ విరహం కూడా మధురంగా ఉందనే చెప్పాలి. 

1 comment: