Wednesday, December 12, 2012

నవ్వించే ప్రేమలేక???

ప్రియమైన పద్మజకు ....

పద్దు..నువ్వంటే నాకెంతో ముద్దు,
బొద్దుగా ఉన్నవని నిన్ను ప్రేమిస్తుంటే ...వద్దు అని వెళ్ళిపోతున్నావు. ఎదురువచ్చి అడ్డుపడితే జిడ్డు మొహం అని కోపగిస్తున్నావు . అసలు నీకు తెలుసా పద్దు ..అసలు నువ్వు కాలేజీలో కనపడిన రోజే కన్నేసాను క్యాంటీన్లో ఉన్నప్పుడు లైన్ వేశాను కాని నువ్వు మొహం చాటేశావ్.

పరుగులో పీ టీ ఉష , సొగసులో నేటి త్రిష ,హైట్లో లయ వెయిట్ లో శ్రేయ కాకపోయినా ... ఆసిన్ అందం , హన్సిక మందం లేకపోయినా ,మమత పాట ముమైత్ ఆట రాకపోయినా ఇష్టపడ్డాను. నీ ప్రేమ పొందడానికి కష్టపడ్డాను. వారం రోజులు నువ్వు కాలేజీ రాకపోతే నీ కోసం పలకరిస్తూ తిండి , నిద్ర, లేఖ అలమటిస్తూ ఎలాగోలాగ నీ చిరునామా తెలుసుకున్నాను. అసలే నీ మీద బెంగతో బరువెక్కిన గుండెతో, బాధ కళ్ళతో , చూడాలని మీ ఇంటికొస్తే మీ అక్క తిట్టినా తిట్లు, మీ కుక్క పెట్టిన గాట్లు నన్ను మరింత కుంగదీసి వేధించాయీ.
కనీసం నాతో ఫోన్ లో అయిన మాట్లాడాలని ఇండియా సున్నేక్టింగ్ అని రాసి ఉన్నా బీ ఎస్ యెన్ ఎల్ కొనుకున్న. ఇండియా ఏమో గాని కనీసం నీ హృదయం లో సున్నేక్టింగ్ కుదరలేదు. న రియల్ లవ్ నీతో ఎలాగైనా చెప్పాలని , ప్రయతిన్చా. కాని నీతో అలయన్స్ అయ్యే అవకాశం రావటం లేదు . జీవితం మారిపోతుదంటే ఐడియా తో ట్రై చేశా . నువ్వేమో టాటా ఇండికాం తో టాటా చెప్పాలని చూస్తున్నావ్ .
నీ కోసం మండుటెండలో కాపు కాశ . న్న ప్రేమ రాని కోసం భోని సినిమా మొదటి షో టికెట్లు సాధించా 

నువ్వు ఒప్పుకుంటే మన ప్రేమ వివాహానికి చంద్రబాబుని రాప్పిస్తా ...కిరణ్ తో మాట్లాడి మంత్రి పదవి ఇప్పిస్తా ... చిరు పార్టీ లో సీటుకు ట్రై చేస్తా ..........

No comments:

Post a Comment