Tuesday, December 25, 2012

మొదటి ప్రేమ...........

నా కవిత్వానికే కౌగిలివయ్యావు
నేను నీకు జీవితాంతం గుర్తుండక పోవచ్చు
కానీ గుండెల్లో నిదురించేనీకు నా జ్ఞాపకాలలో మరుపు లేదు.
ఆనాటి నీ రూపం 
నా కనుపాపల్లో ఇంకా పదిలం..
ఆనాటి నీ నవ్వు నా పెదవులపై దాచే ఉంచా
ఆనాటి నీ చూపు 
నాకు నన్నే చూయించింది.
నే చెప్పె కథలను విన్న నువ్వు 
నాకవిత్వానికే కౌగిలివయ్యావు
మీసాలు వచ్చాక చెబుదాం అనుకుంటే
నా జీవితం నుంరే మాయం అయ్యావు!!
మొదటి ప్రేమవు నువ్వు.
మరవలేను నేను.

No comments:

Post a Comment