Saturday, September 29, 2012

గాయమైన మనసు . . . . . . !


¤ వింతగ నన్ను కలిశావెందుకు . . . ? 
నా మనసుకు ప్రేమను పంచావెందుకు . . . . ? 

ఇంతలా నన్ను మార్చావెందుకు . . . ? 
నా కలలో నువ్వే నిలిచావెందుకు . . . . ? 

నా ఊహలకు ఊపిరి పోసి . . , 
నా కలలకు ఒక రూపం చూపి . . . . , 

నువ్వే నా లోకం అనిపించి . . , 
నువ్వు లేనిదే నే లేననిపించి . . . . , 


ఒంటరిగా నను విడిచావెందుకు . . . ? 
నా మనసుని గాయం చేశావెందుకు . . . . ? 

కన్నీళ్ళను పరిచయం చేశావెందుకు . . . ? 
నను కలలకు దూరం చేశావెందుకు . . . . ? 

నేను !!


నేనెవరినని...
ఎవరికిఏమౌతానని...
ఇలాచాలాసార్లు ప్రశ్నించుకున్నాను నామదిని... 
కనీసం అదైనా ఏదోనాడుసమధానమివ్వకపోతుందానని... 
పాపం...
అదికూడాచేసిందిఎన్నో విఫలయత్నాలను! 
చివరకు తేల్చింది దయచేసి తనను వదిలేయమని!!   
ఇంతకూ...
నేనెవరినని... 
ఎవరికిఏమౌతానని...
ఈప్రశ్నను అసలు ఎవరిని అడగాలని... 
విసిగి విసిగి వేసారి...
   చివరకు నన్ను నేనుగా ఆవిష్కరించుకొనేందుకు ఈచిన్న ప్రయత్నాన్ని ఆరంభించాను...   
నేను...
 శూన్యంలోకి చూస్తు పిచ్చిలెక్కలేవోవెసుకొని మురిసిపోయే...
                                                                 గణాంక కోవిదుడ్నినేను!!
 మహాభారత రామయణాలలో ఎదిగొప్పో నెగ్గుతెల్చేందుకు... 
      మిత్రుడు రవికాంతునితో ఇష్టాగొష్టిలుజరిపిన పేద్ధ సాహితివెత్తను నేను !!
స్త్రీ స్వేచ్చాస్వాతంత్రాలను హరించే పురుషజత్యాహంకరం మీద... 
             యాసిడ్ దాడులనుచెయ్యాలనుకొనే ఉన్మాదిని నేను!! 
చర్చలకేమీ అందనపుడు ఆడదానికట్టూబొట్టుల గురించి...
             గంటలకొద్దీ విమర్శించే సగటు మగాడిని నేను!!

శంకర్ దాదా సినిమాను చూసి...
             కనీసం ఒక్క సెకెనైనా గాంధీలా బతకాలనుకొనే అసలైన గాంధేయవాదిని నేను!!
నేను ముస్లీం ననగానె ఇబ్బందిగాచూసిన చూపులకు ఎలా సమాధానమివ్వాలో తెలీక
 నిత్యం హనుమంతుడిగుడిముందు నా గుండెగోడునువెల్లిబుచ్చుకొనే భారతీయుడిని నేను!! 
ఈప్రపంచాన ఆకలిదప్పులచావులనేవి వుండకూడదని...
      రొజులకొద్దీ ప్రణాళికలు వేసె స్వయంప్రాతిపత్తికా ప్రణాళికాసంఘన్ని నేను!! 
కంప్యుటర్ యంత్రలముందు మొకరిల్లి...
     జీవితపు సున్నితత్వాన్ని కొల్పోతున్న యాంత్రికుడిని నేను!!
వారానికి మూణ్ణలుగుసార్లు కొళ్ళనుమేకలను నములుతూ...
     జీవహింస గురించి లెక్చర్లుదంచే గొప్ప అహింసావాదిని నేను!!
కలెక్టరునై  జనాన్నిఉద్ధరించడమె  నా జీవితలక్ష్యంగ చెసుకోని... 
     మావూరి ఎమ్మర్వో గారి పైరాబడి గురించి ఆరాలుతీసే దీనజనోద్ధారకుడిని నేను!!   
మీటరు ఆటోల్లో, ఆఫీసు క్యాబుల్లో కూర్చోని...
      బస్సుల్లో ఫూట్ బొర్డింగ్ ఎంతప్రమదమోనని ఆలోచించే మేధావిని నేను!! 
ఇంకా చెప్పలంటే...  
   కొన్నిసార్లు కవితలామారి...
           పిడిబాకుపదలతో విప్లవజ్యోతుల్ని వెలిగిస్తుంటాను!!
  మరికొన్నిసార్లెమో సమిధలా మారి... 
           శ్రీశ్రిగారి కలలకు వారసుణ్ణై మురిసిపోతుంటాను!!
   ఇంకొన్నిసార్లైతే ఏకంగా ఉవ్వెత్తున ఎగిసేప్రవాహాన్నై... 
           సామాజిక అసమనతలను రూపుమాపి సోషలిస్టు జలాలను నలుమూలలా ప్రవహింపచెస్తుంటాను!!
    ఇక ... ఎన్నో సార్లు పెనుతుఫానునై...
          పేదగొప్పతారతమ్యాలను పేకటివేళ్ళతో పెకిళించేస్తుంటాను!!

సదా నీ ప్రేమలో.......


ఎపుడైతే నీ రాకకై నా కనులు వీక్షించాయో ...
ఎపుడైతే నీ పలకరింపుతో నా యద పులకరించిందో...
అపుడే తెలిసింది...
      నువ్వంటే నా కిష్టమని!
      నా యదలో వుంది నీ రూపమని!!

కాని...
      నా పెదవి దాటిరాకుంది ఆ మాట!
      నీ మదిని చేరకుంది నా బాస!!

      ఏదో సంశయం!!
      కాదంటవేమోనన్న భయం!!
      గుండెనువీడని ఒక అనిర్వచనీయ అనుభవం!!
     ఒకటి మాత్రం నిజం...
                  ఇలాంటి భావమే వస్తంది ఎదోనాడు నీ మదిలో కూడా!!
                   నాటివరకు వేచివుంటా ప్రియా నీ కొరకై...
                                                    ఎన్నాళ్ళైనా...
                                                    ఎన్నేళ్ళైనా...
                                                          సదా నీ ప్రేమకై తపించే..   నీ గిరి డార్లింగ్....

Friday, September 28, 2012

కొంచెం మరుపైన కావే ...

బ్రతుకంతా భారంగా ఈ  బాధలో,
బ్రతికిన్చుకోలేని నీ ప్రేమలో..

గాయాల పాలైన నా గుండెలో,
నే మరిచిపోలేని నీ నవ్వులో..

చిరు వణుకు పుడుతున్న నా గొంతులో,
నే పిలువలేకున్న నీ పేరులో ..

గుండె నిండి,
కంట జారి,
నన్ను వదిలి వెళ్ళినా..

నిన్ను నేను,
మరువ లేను,
మరలి రాని ప్రియతమా..

నా కనుపాపలలో  నువ్వే 
నా కను చెమ్మల్లో నువ్వే 

కలలో కూడా నీ నవ్వే 
కొంచెం మరుపైన కావే ...

కన్నీళ్ళు కరిగిపోయాయి......


నా కళ్ళలో చూడు నా గుండెలో ఉన్న నువ్వు కనపడతావు
నిన్ను అడగాల్సిన ప్రశ్నలు అన్ని ఐపోయాయి
నా కళ్ళలో కన్నీళ్ళు కరిగిపోయాయి
నన్ను ద్వేషించడం నీకు ఇష్టం
నిన్ను మరిచిపోవడం నాకు కష్టం
మళ్లీ జన్మంటూ ఉంటె నీతో ఎప్పటికీ కలిసుంటే చాలు
ఈ జన్మకి నువ్వు మిగిల్చిన కన్నీళ్లు చాలు

Thursday, September 27, 2012

"ఆడపిల్లగా" పుట్టడం నేను చేసిన నేరమా...??


పాపాత్ములు పరిపాలిస్తున్న ఈ కలియుగంలో
"ఆడపిల్లగా" పుట్టడం నేను చేసిన నేరమా...??
వరకట్నం ఇవ్వలేని కన్నవాళ్ళ కన్నీటి కథలకు
కారణం కావడం నాకు శాపమా....??
ఎదిగిన నేను,నవ మాసాలు మోసిన అమ్మకు భారమయాను
నడక నేర్పించిన నాన్నకు గుండె కోతగా మారాను


ప్రేమగా ఆటలాడిన అన్నయ్యకు డబ్బు తుంచే తక్కిడినయాను..!!
ఆడపిల్లంటే ఆడ-పిల్లే కాని ఏనాటికి ఇడ-పిల్ల కాలేదన్న సమాజం
మాటలకు ప్రతిక్షణం నేను భాదపడిన.....
దేశంకోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన అమర వీరులకు
జన్మనిచ్చిన "ఆడజాతిలో" నేను ఓ ఆడపిల్లగా....
పుట్టినందుకు గర్వంగుంది.

నిరీక్షణ..!!!


ఆ కారుమేఘం కనులనిండా ఇంత నీరు నింపి పోయింది 
తొలకరికేనాడూ నే పులకరించలేదనేమో
ఆ చల్లగాలి ఒళ్లంతా ముళ్ళు గుచ్చి పోయింది 
ఆసాంతం తాకి పలకరించినా నే తనకేనాడూ బదులీయలేదనేమో
ఆ సుమ సుగంధాలు మనసుని మరింత బరువెక్కించాయి 
చెంత చేరిన పరిమళాన్ని నే నేనాడు ఆస్వాదించలేదనేమో
ఆ వెన్నెల నను నిలువనీయడం లేదు 
క్షణమైనా నే నేనాడు తన ఝరిలో తడవలేదనేమో

తెలియక చేసిన తప్పులని నను మన్నించక 
ఇంత కక్ష నా పై న్యాయమా
ఓ ప్రకృతి శ్రావణానికై నిరీక్షించే నను 
ఇకనైనా కనికరించవా ..

Wednesday, September 26, 2012

!! తల్లి కాలేని స్త్రీ ఆవేదన!!



అమ్మాయి పుట్టింది!  మహాలక్ష్మి అన్నారు!
అమ్మాయి బాగా చదవుతోంది!  సాక్షాతూ  చదువలసరస్వతి అన్నారు!
అమ్మాయి కి ఈడు  వచ్చి పెళ్లి జరిగింది! సాక్షాతూ ఆదిదంపతులు అన్నారు!
ఇంతవరకు అమ్మాయిలో అన్ని దేవతలను చూసారు!
అప్పుడు ఆమె  మౌన మూర్తి  వినటమే తప్ప  మాటలాడటం ఎరుగదు!
మరి  నేడు అందరు   ఆమెని  రాక్షసి అని బరితెగెంచిదని!అంటున్నారు
కారణం ఇప్పుడు నోరు తెరచి తనకు మాతృత్వం ఇవ్వన్ని వివాహబంధం వద్దు అంది!
తనకి ఎందుకున్యాయము చెయ్యరూ అని అడిగింది!
అమ్మతనం కావాలని  కోరుకోవడం తప్పా అని ప్రశ్నించిది?
ఏదిన్యాయము ! ఏది ధర్మం అని ఆక్రోశి౦చింది ఆ స్ర్తీ హృదయం!
ఎవరు ఆమెకి న్యాయము చెయ్యలేదు. వేరే దారి లేక మరణాన్ని ఆశ్రయించింది!
మండుతున్న మనసుతోపాటు  తనువు కూడా  అగ్నికి ఆహుతి అయ్యింది!
ఆహ!  నిజంగా నీవు  సతివే  సుమా  అని  అందరు వేనోళ్ళ పొగిడారు!
ఆమె మరణం  తో మరింత దివ్యత్వాన్ని పొందింది అని ఆనందించారు!
అంతే కానీ ఆమె నిండునూరేళ్లు అర్ధం లేకుండా ముగిసాయని ఎవరు భాదపడలేదు
ఎవరు అర్ధం చేసుకుంటారు   వో   స్త్రీ   నీ    గుండె లోతుల బాధని?
ఎవరు అర్ధం చేసుకుంటారు తల్లీ  నీ ఆవేదనని???

ప్రేమంటే ఇదేనా.....


రోజంతా సుఖం లేదు
రాత్రి అంత నిదుర లేదు
శ్వాసకు చోటు లేదు  
మనసుకు నిలకడ లేదు
ఓ దేవుడా.....ప్రేమంటే ఇదేనా.....

ప్రేమంటే.........................


గువ్వ పిట్టల్లానో
లేడి పిల్లల్లానో
ప్రకృతి ఒడిలో స్వేచ్చగా గడిపి
అమాయకత్వంతోనో
నిర్మలత్వంతోనో
భవిష్యత్తేమిటో పూర్తిగా తెలియక, ఊహించక
చేజేతులా బతుకును
విషాదంలో ముంచేసుకొనే
ప్రేమిక జీవులు ఎందరో!
పెళ్ళంటే రెండు హృదయాల కలయిక
పెళ్ళంటే ఆత్మీయ బంధం
అని తెలిసి కూడా తెలియక
సమాజ ఇనుపచట్రంలో ఇమిడి, నలిగి
మనసుల్ని చంపేసుకుని
బతుకుల్ని బలిచేసుకునే
అభాగ్యజీవులెందరో !
స్వచ్ఛమైన మనసుతో పరస్పరం ప్రేమించుకొని
స్వేచ్చా విహంగాల్లా ఒకరిపై ఒకరు మనసు పారేసుకొని
జ్ఞానంతోనో, అజ్ఞానంతోనో
ఒకరిపై ఒకరు త్యాగం చేసుకొని
బతికే ప్రేమైక జీవులు ఎందరో !
అలాంటివారికి
ఇంకా
తనేమిటో, నేనేమిటో పూర్తిగా తెలియక
భవిష్యత్తును ఊహించక
బతుకింతే అనుకుంటూ
నన్నీసాహితీ సముద్రంలో పడవేసి దూరంగా ఉన్న
ఓ స్నేహామయికి
ప్రేమమయికి
ప్రేమతో

Monday, September 24, 2012

చెరువులో నీళ్ళొచ్చాయి............


చెరువులో నీళ్ళొచ్చాయి

నెల క్రితం ఎండి బీటలువారిన గుండె

నేడు నిండి లయబద్ద నృత్యం చేస్తూ

గట్టుమీది చెట్లు

ఆకుల్లో తడి ఆర్చుకుంటున్నాయి

చల్లగాలి సహయంతో

నీటిలో బింబాల్ని చూస్తూ

ఆకులు సవరించుకుంటున్నాయి మరి కొన్ని

లేలేత కిరణాల

తళుకుబెళుకు లందుకుని

అటు ఇటూ కదిలే అలలు

కాళ్ళు కదపకుండా

కళ్ళూ తిప్పుతూ

కొంగల

విన్యాసాలు

గట్టు పై కుహూ కుహూ రావం

నీటిలో బెక బెకల తాళం

పూల పేరంటాలు

సీతాకోక చిలుకల హడావిడి

ప్రకృతితో ప్రకృతిని నింపడం

బహుశా, ఒక్క అంతర్యామికే సాధ్యం

Sunday, September 23, 2012

నన్ను ప్రేమించకు ప్రియతమా.......


నీ ప్రేమకోసం నేను పడిన వేదన,







నా ప్రేమను నీకు వ్యక్తం చెయ్యాలన్న ఆవేదన,






నీకోసం జారే ప్రతి కన్నీటిబొట్టు చూసినప్పుడు కనిపిస్తుంది,నా మదిలొని నీ ప్రేమ,






నీ కోసం కన్నీళ్ళు పెడుతున్నా ఆనందంగా ఉంటుంది,






దూరమైన నీకోసం చూసే ఎదురుచూపులోను ఆనందమే,






నీవు చెంతనున్నా ఇంత ప్రేమ కనిపించదేమో,






నీ ప్రేమ పొందాలని పడే ఆరాటం,






నిన్ను చేరువవ్వాలన్న ఆకంక్షా,






నీతో సమయాన్ని గడపాలన్న ఆలోచనలు,






నీ ప్రేమ దొరకకముందున్న నాప్రేమ అనంతం,






అసలు ప్రేమలో కాదు ఎదురుచూడటంలోనే ఆనందముంది,






ప్రేమ దోరకముందు ప్రేమ కనిపిస్తుంది,






కాని ప్రేమ దొరికిన తర్వాతా ప్రేమ మాయమవుతుంది,భాధ్యత ప్రారంభమవుతుంది.






అందుకే నన్ను ప్రేమించకు ప్రియతమా.

కలం కన్నీరు పెడుతుంది...


కలం కన్నీరు పెడుతుంది...
శ్రమజీవి స్వేదానికి
ఎర్రరంగు పూసిన రుదిరాన్ని
సిరాగా చూసినప్పుడు...
కలం కన్నీరు పెడుతుంది...

అభాగ్యురాలి...
కన్నీటి కథ రాస్తున్నప్పుడు
కలం కన్నీరు పెడుతుంది...
అగ్నిసాక్షిగ పెళ్ళాడినవాడు...
్గ్నికి ఆహుతి చేసినపుడు
కలం కన్నీరు పెడడుతుంది...
 
అమాయకపు పసిపాపల...
అపహరణ హత్యోదంతాలను రాస్తున్నప్పుడు
కలం కన్నీరు పెడుతుంది...

వికసించే పువ్వులపైన
యాసిడ్ వర్షం కురిసినప్పుడు
కలం కన్నీరు పెడుతుంది...
మరి ఆ పువ్వులు...కలిగే కన్యలయితె..
ఆ .. యాసిడ్ ప్రేమ రక్కసి కదా అని..
కలం కన్నీరు పెడుతుంది...

కష్టజీవి కష్టాన్ని దళారి దోచేస్తుంటే..
కలం కన్నీరు పెడుతుంది...
వికసించే పువ్వులేవని...
చిరుగాలిలో..గుభాళింపులేవని
కలం కన్నీరు పెడుతుంది...

అరణ్యాలు ఆక్రమణలకు గురై
సస్యశ్యామల ఎడారులైనపుడు?
కలం కన్నీరు పెడుతుంది...
తరాలెన్ని మారినా..
యుగాలెన్ని గడిచినా..
బడుగుజీవి బతుకు...
పరాధీనమేనని...
ఔను! కలానికీ మనసుంది...
అందుకే కన్నీరు పెడుతుంది
నేను కలంగా ఎందుకు పుట్టానని!

జీవితం


జీవితం
ఒక్క మాటతో మైమరచిపోయే కాగితం
ఆశావాదాన్ని నింపుకున్న సింహాసనం
వెన్నెల్లో విహరిస్తూ వెదికే మౌనరాగం
అందని అనురాగం కోసం
అలమటించే ఆలాపనం
పరిమళాల పూలదండల మధ్య
కనిపించీ కనిపించని దారం
 
సంచలనాత్మకమైన శిక్షల వలయం
అభయమిచ్చే అదృశ్య వ్యక్తికే తపించే అమాయకం
కాదంటే కానరాదు
అవునంటే వదిలిపోదు
అవును  కాదుల మధ్య
అవునో కాదో తెలియని సందిగ్ధం......

నేనేం చేశాను పాపం........

బాసూ....
నేనేమి చేశాను పాపం
నాకెందుకు ఈ శాపం
నాలో లేదు లోపం
ఆలోచించండి కొంచెం

మీకై వేచి చూసి
మీ బరువుని మోసి
మిమ్మల్ని ఇళ్లకు చేరవేసి
ఇదేనా నేను చేసిన తప్పు
చెప్పండి గుండె మీద చెయ్యేసి

దూరం ఎంతైనా
ఎక్కేది ఎవరైనా
కష్టం ఎంతైనా
మీ కోసం పని చెయ్యడమే
నా తప్పైతే చెప్పండి ఒక్కరైనా

ఎవరు తప్పు చేసినా శిక్ష నాకా
ఎక్కడ తప్పు జరిగినా బాధ్యత నాదా
ఏమని చెప్పను నా బాధ
మంటల్లో కాలిపోతున్న నా ఆత్మ వ్యధ

ఇకనైనా ఆలోచించాలి మీ అందరూ
ఆవేశపడకూడదు ఏ ఒక్కరూ
నాపై కోపం చూపొద్దు ఎవ్వరూ
ఇది నిజం, మీ సేవకై పుట్టిన
నాపై ఇక మీరు దాడిచెయ్యరు

ఇట్లు మీ
అమాయకపు బస్సు

స్త్రీ మూర్తి



స్త్రీ మూర్తి

ప్రతి ఇంటా గృహలక్ష్మిగ నిలచిన ఓ వనితా
నీవు లేని ప్రపంచాన్ని ఊహించుట సాధ్యమా
ఓర్పు సహనం త్యాగం ఇవి అన్నీ నీ సొంతం
కారుణ్యం ప్రేమతత్వం నీలోనే నిక్షిప్తం

మొక్కవోని ధైర్యానికి శివాజీయే నిదర్శనం
అది నింపిన జిజాబాయి తల్లులకు ఆదర్శం
'తల్లి ఒడి - తొలి బడి' అను నానుడిని వినలేదా
నిరూపించు తర్కాణం ఇది ఒక్కటి చాలదా
స్ఫూర్తి మూర్తివి నీవు యుక్తి శక్తి నీ సొంతం
మాతృమూర్తిగ నిలిచే సామర్థ్యం నీ సొంతం

వనితలార మేల్కొనండి, అబలలుగా ఉండకండి
అడుగు ముందుకేయండి సబలలమని చాటండి
దేశం గర్వించదగ్గ స్త్రీమూర్తులు ఎందరో
వారి అడుగు జాడలలో మీరంతా నడవండి.....

Saturday, September 22, 2012

నువ్వే నా ప్రాణం....... ................ .....


విడిపోయెందుకే కలిశామా మనం
కనురెప్పలుగా మిగిలాం ఎందుకో
కనురెప్పల్లా అలా కల్సి ఇలా విడిపోతాం ఎందుకో
కనులు మూస్తే నీ జ్ఞాపకం
తెరిచి ఉంచితే కనుమరుగౌతుందేమో అని భయం

లిప్త పాటులో మరణం...ఎన్నాళ్లీదూరం
మదిలో మెదిలే భావాలకు రూపాన్నిద్దామనే ప్రయత్నం
అవమానించావు నన్ను..ఆ అదికారం నీకే ఉందిలే
నేను ప్రేమిస్తూనే ఉంటాను..నిన్ను ప్రేమించమని నేను చెప్పలేదే.?
ప్రేమించాను అన్న నీవే ...ప్రేమను అపహాస్యిం చేస్తున్నాను అన్నావు
 

మనసు విరిగింది అన్నావు.. నామనస్సు ఏమైందో అడిగావా ప్రియ
అప్పుడు నీవు అన్న మాటలు అన్నీ అబద్దాలేని పెట్టిన ముద్దులు బ్రమలేనా ప్రియ
నా ప్రేమలో అర్దం మారిందా .. నీ మనసులో నాస్థానం చలించిందా ప్రియ
మనసులో మరొకరు చేరినా..మదిలో నిలచిన జ్ఞాపకాలు చేదుగా మారతాయా
అంతకుముందున్న వాళ్ళు ఏదన్న తప్పుగానే అనిపిస్తుందేమో...?
నన్ను అవమానించడం అలవాటు చేసుకున్నావు
భాదపడటం నేను అలవాటు చేసుకుంటున్నాను
అశాశ్వతమైన ఈ జీవితం
అందులో ప్రేమ పరిమితం
నీ స్నేహం మధురం
ఈ దూరం గాయం
నువ్వే నా ప్రాణం....... ................ ..... 

ప్రేయసి ......


గుప్పెడు మనసు


గుప్పెడంతే ఉన్నానంటూనే 
ఎన్నో భావాల దొంతరలను దాచుకుంటుంది 
ఎన్నో ఊహలకు ఊపిరి పోస్తుంది 
ఎన్నో ఆశల సౌధాలకు పునాదులు వేస్తుంది 
మరెన్నో స్వప్నాలకు ఊతమిస్తుంది 

కాస్తంత సంతోషానికే కడలి తరంగమౌతుంది 
కొండంత విషాదమొస్తే ఆల్చిప్ప తానౌతానంటుంది

అనుభవాల వ్యవసాయం చేసి 
అనుభూతుల పంట పండిస్తుంది 

అలసి అప్పుడప్పుడు  స్తబ్దమోతుంది 
అంతలోకే నూతన చైతన్యంతో ఉరకలు వేస్తుంది 

కాస్త కలవరానికే కనుల వెంట జారి 
తన ఉనికిని చాటుకుంటుంది  

నిత్యం సంఘర్షణ రాజీలతో సతమతమౌతూనే 
నవ వసంతానికై  ఆశగా వేచిచూస్తుంది 
నా మనసు.

ఓ ఆడపిల్ల మనోవేదన.........


ఓ ఆడపిల్ల మనోవేదన

అమ్మకాల నడుమ నలిగే ప్రాణమున్న రాతి బొమ్మని,
భరించేవాడు వేలకడుతుంటే,
కన్నవాళ్ళు ఆ ధర చెల్లిస్తున్నారు,
ఏమాత్రం ఇది న్యాయం.
నిజానికి, నీతికి వున్న తేడా చెప్పిన వాళ్ళే,
నేను ఇది పాపం అని తెలిసిన నాకు ధర చెల్లిస్తున్నారు.
ఇనుప ముక్కలతో చేసిన ముళ్ళతో నా మనసు చంపేస్తున్నాడు నన్ను కట్టుకోబోయే వాడు,
కట్నం పేరుతో తనను తాను వంచించుకొంటున్నాడు.
ఎక్కడ పుట్టింది ఈ దురాచారం, ఎందుకు మన దేశానికి పట్టుకొమ్మ అయ్యింది.
ఉన్నవారి దగ్గరనుండి లేనివారు అనే భేదం లేకుండా అందరికి నట్టిల్లయ్యింది. 
మన శరీరానికి చిన్న వ్యాధి వస్తేనే బాగుచేయడానికి నానా రకాలుగా ప్రయత్నిస్తాం------
మరి మనసు మన శరీరంలో అతి ముఖ్యమైన భాగం.
మరి మనసుకు పట్టిన వ్యాధిని తొలగించలేమ......
ఇది చాలా మహమ్మారి ఈ వ్యాదికి బలైన వారు ఎదుటి వారి ప్రాణాలు సునాయాసంగా తీయగాలుగుతున్నారు.
భారతీయుడా ఈ మహమ్మారిని మన దేశం నుండి తరిమి కొడదాం.
దయ చేసి సహకరించండి..... ప్లిజ్ 

వీడ్కోలు......


ఆ వీడ్కోలు క్షణంలో
నిర్వీర్యమయిన నీ ముఖం
నన్ను వెంటాడుతూనే ఉంది

ఎంతో అనుకుంటాను
ఏదో చెయ్యాలని
ఎంతైనా చెయ్యాలని

దూరాలు పెరిగే కొద్దీ
ప్రేమలు ఆప్యాయతలు
ఫోను తంత్రులకు
చెక్కు ముక్కలకే
పరిమితమై పోతున్నాయి

నీ ఒళ్ళొతలపెట్టిన తృప్తి
నా తలపై తిరిగిన నీ చేతి వెచ్చదనం
ఏ చెక్కుతో కొనగలను ?

ఒద్దనుకున్న క్షణాల్లో
స్థంబించే కాలం
ఇపుడు చిన్నగా నైనా
కదలదే?

బరువైన శ్వాసలు
అదిరే చుబుకంతో
తడిసిన పరిసరాల వెనక
నీ ముఖమూ..
స్పష్టంగా కనబడదు.

గడిపిన నెల రోజుల ఆనందం
ఈ ఒక్క క్షణం..
బూడిదవుతోంది

కనీసం ఈ క్షణమయినా..
గుండెలు మండుతున్నా..
మాటలు రాకున్నా..
ఊపిరందకున్నా..

ఆగిపోతే బాగుండు. గిరిగౌడ్ 

కవిత.............


తలపు తడుతూ నేల గంధం
తలుపు తీస్తే..

ఆకాశం కప్పుకున్న
అస్థిరమయిన రూపాలు
తేలిపోతూ.. కరిగిపోతూ ..
అలజడిచేస్తూ..
అక్షరాల జల్లు

నిలిచే సమయమేది ?
పట్టే ఒడుపేది ?

పల్లంలో దాగిన
జ్ఞాపకాల వైపు ఒకటే పరుగు.

తడుపుదామనో
కలిసి తరిద్దామనో..

గుండె నిండేసరికి
నిర్మలాకాశం
వెచ్చగా మెరిసింది.    గిరిగౌడ్ 

అన్వేషణ


ఆకాశంలో మేఘం ఆవేదనతో నా హృదయం

అన్వేషించే నీ కోసం అనుక్షణం నీ కోసం,
కన్నుల నీరు నువ్వేనా కనిపించని నా చిరునవ్వేనా
ఎంతకాలం దాచగలని బాధ  నా మదిలోన,
కదిలే మేఘం చూపెనా , ఎగసే అలలే తేలిపెనా
వీచే గాలి చూపెనా, పూచే పువ్వులు తెలిపెనా

నీ  చిరునవ్వుల చిరునామా,ప్రేమకు ప్రాణం పోశావు ప్రాణం నీవై  నిలిచావు
గుండెలోని వేదనంత నీకు విన్నవించే క్షణం కోసమే నా నిరీక్షణ,
ఎందరి మధ్యన  నేనున్నా, ఎదురుగ నీవున్నావన్న భావనతోనే  బ్రతికున్నా
ఆది అంతం మనమేగా అంతరిక్షం వరకైనా,  

[అలుపెచెందక  నా మనసే ఆగక నిను వెతికేనా….

నా చూపు వైశాల్యాన్ని కుదిన్చేస్తావు..


ఏ నక్షత్రాలు మనసుపడి ఇచ్చాయి ఆ నవ్వుని నీకు…

మెరిసే సొగసైన పంటి వరుసతో..

నా ప్రాణాల్ని హాయిగా చెదరగొట్టే మాయతో..

వయసు బరువునంతా మోసే మెత్తటి పెదవులతో.. నవ్వు… నీ నవ్వు.. !


అసలు నీ నవ్వు ఒక్క అధరాల సొంతమా..?

అంత అందమూ వాటిదేనా..? కాదంటే కాదు.!

చూపే పెదవులే అంత అందం తో తరిస్తుంటే..

సృష్టించే హృదయం ఇంకా ఎంత అద్బుతమై ఉంటుంది..!

దాన్ని మోసుకొచ్చే ఆలోచన, తన అదృష్టమనుకుంటుంది..!


ఏదో ఈ లోకానికి తెలియని.. నేను ఓపలేని.. అనుభూతిని కళ్ళతో నా మనసులోకి అదుముతావు..
నువ్వు నవ్వినప్పుడు..

నీ పెదవులే ప్రపంచామనుకునేల నా చూపు వైశాల్యాన్ని కుదిన్చేస్తావు..

రక్తాన్ని ఆపి, శ్వాసని నీ ఆధీనం లోకి లోబరుచుకుంటావు..

ఇన్నీ అంత దూరం నుండే ఎలా చేస్తావు ..???

ముడుచుకుపోయినా ముద్దుగా ఉండే నీ చిన్ని గడ్డం.

ఎర్రని మెరుపులతో వెలిగే తీరిన బుగ్గలు.

ప్రాపంచిక అందాలన్నీ పూర్తయ్యేది నీ నవ్వుతో కలిపి చూస్తేనే కదా.. !

అన్ని దిక్కుల్లోను ఉదయిన్చగలిగే అద్బుతం నీ చిరునవ్వే కదా..!


అయనా..


నీ పెదవోంపు నా హృదయం లోకి ఓంపిన అనిర్జీవమైన సాగరంతో..

ఈ అక్షరాలని తడిపేదెంత..? ఓ చినుకంత..!!!!

ఆమెతోనె నా ఏడు అడుగులు


ఆమెను చూస్తే కంటికి వెలుగు రావాలి,ఊహలకు ఊపిరి కలగాలి,ఊపిరికి వేగం పెరగాలి,

ఆశల రెక్కలు విచ్చుకోవాలి,కలలకు ఆకారాం రావలి,ఆ నిముషం స్వర్గం అవ్వాలి,


తన వెన్నెల చూపుల వెలుగులకు యదలో అలికిడి కలగాలి,


తను నడిచొస్తుంటే హ్రుదయ తలుపుల్లో అలజడి రేగాలి,

తన కాలి అందెల సవ్వడికి ప్రక్రుతి పరవసించాలి,

తన మేని పరిమలాలు అత్తరులై ఆకాశాన్ని అంటాలి,

ఆమె స్పర్శతో గుండె లోతుల్లో పవనాలు వీచాలి,

తన కౌగిలితో కంటినీరు ఉప్పెనై ఉబకాలి,

గుండె గుడిలో తన రూపం శాశ్వితంగ నిలిచిపోవాలి,

తననవ్వులు జన్మ జన్మలకు పువ్వులై వర్షించాలి,

పెదవి అంచుల్లొ ప్రతిక్షణం పరితపించె నా పేరె వినపడాలి,

ఆమెతో వేసె 7 అడుగులు 7 జన్మలు గుర్తుకు రావాలి,

తన మాటల గలగల లతో నన్ను నేను మైమరచిపోవాలి,

మెల్లగ ఆమె అడుగుల్లొ అడుగు వెస్తు ప్రపంచాన్ని మరవాలి,

చిగురించె నా చిరు చిరు ఆశలు తన హ్రుదయంతో చిలకాలి,

నా చిటికెన వేలు పట్టుకోని పెళ్ళిబందానికి ప్రాణం పొయాలి,

ఆనందపు అందాలు,అల్లర్లు తన సౌందర్యమైన మోములో కనపడాలి,

విరహయాతనతో నోట మాట రాకుంటే కంటి బాషతో మనసు వెదనంతా తెలుసుకోవాలి,

ప్రతిరోజు ఓ ప్రెమికుల రోజు అయ్ ఇరువురి ఊపిరి గాలిలో ఏకమైపోవాలి..

ప్రియా.... నీ జ్ఞాపకాలు నన్ను వెంటాడే తుమ్మెదలు



నాపై ప్రసరించిన నీ తొలిచూపుల కిరణాలు
నా హృదిలో ప్రేమ వీణను మీటాయి

నాపై విసిరిన నీ చిరునవ్వుల బాణాలు
నాలో మల్లెల విరివానలు కురిపించాయ్

ఒకానొక రోజున అంటీ అంటనట్లు తగిలిన నీ చేతి స్పర్శ
ఒక్కసారిగా నా మనస్సును మత్తెక్కించింది

ఒంటరిగా ఉన్న నీ మనసుకు తోడుకావాలన్నప్పుడు
ఒట్టు... అది కలయేమోనని భ్రమపడ్డా

అది కలకాదు నిజం అని నీ వెచ్చని స్పర్శ చెప్పింది
అది కల్లకాదు నిజమేనని నీ పెదవులు చెప్పాయ్

నిజంగా నీ జ్ఞాపకాలు నన్ను వెంటాడే తుమ్మెదలు
నీతోటి స్నేహం అధరాల సాక్షిగా... మధురాతి మధురం

నీ రాక కోసం...
నీ పలుకు కోసం...
నీ పిలుపు కోసం...

ఎన్నాళ్లయినా... ఎన్నేళ్లయినా...