Sunday, September 23, 2012

జీవితం


జీవితం
ఒక్క మాటతో మైమరచిపోయే కాగితం
ఆశావాదాన్ని నింపుకున్న సింహాసనం
వెన్నెల్లో విహరిస్తూ వెదికే మౌనరాగం
అందని అనురాగం కోసం
అలమటించే ఆలాపనం
పరిమళాల పూలదండల మధ్య
కనిపించీ కనిపించని దారం
 
సంచలనాత్మకమైన శిక్షల వలయం
అభయమిచ్చే అదృశ్య వ్యక్తికే తపించే అమాయకం
కాదంటే కానరాదు
అవునంటే వదిలిపోదు
అవును  కాదుల మధ్య
అవునో కాదో తెలియని సందిగ్ధం......

No comments:

Post a Comment