వాన పడకుంటే కరువు
వాన పడితే దొరుకని ఎరువు
నాగలి సాగితే
ఆకలి తీరుతుందనే ధ్యాస
నాట్లు పడితే
పుట్లకు పుట్లు వరి పండుతాదనే ఆశ
అది ఎరువుల దుకాణం
కోసెడు దూరంగా రైతుల లైన్లు
కరువుల కాలం
చేసిన అప్పులు తీర్చలేక
వేసిన పంట చేతికి రాక
కాపుదనం బిడ్డ పచ్చని చెట్టును నరుక్కున్నట్టు
జీవునం తీసుకున్న వైనం
ఏ వత్తిని పోగు పొయ్యనిచ్చిండ్రు
అన్ని కులకశ్పిల పంచ ప్రాణాలు తీసి
మత్యు కర్మాగారానికి పునాదిరాయి వేయడమే
అసలు సిసలు రంకుల రాజకీయం
పొలాల్లో ఉండాల్సిన రైతులు
బురదలో బొర్లాడాల్సిన నాగండ్లు
రోడ్డు మీద బైఠాయింపు
తోడు లేని అతుకులు బీడు పడ్డ బతుకులు
ఇటుపోతే అసర
దొరుకుతుందేమోనని గుంజులాట
అటుపోతే మద్దతు
అందుతుందేమోనని పెనుగులాట
నాటిక సందున ముల్లు ఇరిగింది
నడిచే కాలుకు కాలుగర్ర పడ్డది
చౌక భూములు దున్ని దున్ని
పచ్చి పుండైన మెత్త కాళ్లు
ఏమి తిప్పలు
తండ్రీ! నిప్పుల్ల బొర్లిచ్చినట్టు తండ్లాట
ఏమి అప్పులు
అయ్యా! సితపాతాళం లోతుల
రెక్కలు పులిసి బోరింగ్‌లనుంచి కన్నీళ్లు పడ్డట్టు
పానం కింద మీద కావట్టె
వాన కోసం కప్ప తల్లి ఆట
వాన కోసం బోనాల పండుగ
దరో దరో దంచిందీ లేదు
ముంతల కామన వర్షం పోసింది లేదు
ఒకవేళ వానపడితే విత్తనాలు దొరుకై
విత్తనాలు దొరికితే కైకిలోల్లు రారు
ఎటమటం నాట్లు వేస్తే కరెంటు రాదు
ఆటుపోట్లకు లోనై పంట చేతికి వస్తే
మద్దతు ధర లభించదు
శత్రువు చేతిలో మరణించిన సైనికులు వీరులైతే
ఎవుసం కొనసాగింపులో అసువులు బాసిన
రైతులు పరమ వీర చక్రాంకితులే
పెట్టు పోతలు ఎరువులు పురుగు మందులు
దారం కటిక చిక్కు పడింది
పిడుకడు అన్నం పెట్టే చెయ్యి
దేశం ముందు గోసోలె చెయ్యి చాపాల్సిన దుస్థితి
చెరువులు పాయె
చేన్లు పాయె చెలకలు పాయె
గింత ధీములేని రైతు, కూలీ లేబర్ అడ్డెౌ పాయె
ఎద్దు పుండు కాకికేం ముద్దు
తూము తీస్తే పారే నీళ్లు మనైకావు
కాలు మీద కాలేసుకు ఇంట్ల పంటే
నడిచి వచ్చే పంట మనది కాదు
కడుపు నిండా కపటం.. మాట్లాడితే కారెడ్డం
నోరు నవ్వితే నొసలు వెక్కిరిస్తుంది
మొలచిన మొక్క మొక్కకూ
చెమట బొట్లు కట్టాలె
సాలు సాగిన దుక్కి దుక్కికీ
నెత్తురు కలికలి చేస్కోవాలె
ఇంత చేస్తే పండిన పంట
పెట్టిన లాగోడికి చాలదు
దండిది కడుపు మంట పగోడికి రావద్దు
నిండు కల్లం చిల్లర చిత్తు
దర్నాలు రాస్తారోకోలు
ఊరేగింపులు మహాజరులు పిడికిల్లు నినాదాలు
లాఠీచార్జీలు అరెస్టులు తూటాలు
'మారిందంటివిరో-ఎక్కడ మారిందిరో
మారిందనటానికి-సిగ్గెందుకు లేదురో'
ఎసరచ్చి కడుపు మసిలిపోతుంది
జనం ఉసురు పోసుకుంటున్న
రాజ్యం తప్పక కాలి కూలిపోతుంది
No comments:
Post a Comment