Tuesday, September 4, 2012

ఈ క్షణాన్ని ఆస్వాదించి ఎన్ని నాళ్ళైంది...

ఈ క్షణాన్ని ఆస్వాదించి ఎన్ని నాళ్ళైంది... ఈ క్షణం మంచిదైతే మరు క్షణం మీద బెంగ... గడచిన క్షణం గురించిన నిరాశ ఈ క్షణం చెడ్డదైతే గడచిన క్షణం తో పొల్చి ఆవేదన రాబోయే క్షణాన్ని తలచి అలోచన ఆశ నిరాశల పోరాటం తెలియని ఆ క్షణం... గతాన్ని తలచి వగచడం భవిష్యత్తు కి వెరవటం తెలియని ఆ క్షణం... చివరి సారిగా చూసింది జీవితపు తొలి పొద్దులో, బాల్యపు నీరెండలో అని గుర్తు... ఈ మిట్టమధ్యాహ్నం మండుటెండలో కళ్ళు చించుకుని వెతికినా ఎక్కడా జాడ లేదు... ఎప్పుడు చేజారిందో మరి...గురుతే లేదు.......

No comments:

Post a Comment