ఆకాశంలో మేఘం ఆవేదనతో నా హృదయం
అన్వేషించే నీ కోసం అనుక్షణం నీ కోసం,
కన్నుల నీరు నువ్వేనా కనిపించని నా చిరునవ్వేనా
ఎంతకాలం దాచగలని బాధ నా మదిలోన,
కదిలే మేఘం చూపెనా , ఎగసే అలలే తేలిపెనా
వీచే గాలి చూపెనా, పూచే పువ్వులు తెలిపెనా
నీ చిరునవ్వుల చిరునామా,ప్రేమకు ప్రాణం పోశావు ప్రాణం నీవై నిలిచావు
గుండెలోని వేదనంత నీకు విన్నవించే క్షణం కోసమే నా నిరీక్షణ,
ఎందరి మధ్యన నేనున్నా, ఎదురుగ నీవున్నావన్న భావనతోనే బ్రతికున్నా
ఆది అంతం మనమేగా అంతరిక్షం వరకైనా,
[అలుపెచెందక నా మనసే ఆగక నిను వెతికేనా….
No comments:
Post a Comment