Wednesday, September 26, 2012

ప్రేమంటే.........................


గువ్వ పిట్టల్లానో
లేడి పిల్లల్లానో
ప్రకృతి ఒడిలో స్వేచ్చగా గడిపి
అమాయకత్వంతోనో
నిర్మలత్వంతోనో
భవిష్యత్తేమిటో పూర్తిగా తెలియక, ఊహించక
చేజేతులా బతుకును
విషాదంలో ముంచేసుకొనే
ప్రేమిక జీవులు ఎందరో!
పెళ్ళంటే రెండు హృదయాల కలయిక
పెళ్ళంటే ఆత్మీయ బంధం
అని తెలిసి కూడా తెలియక
సమాజ ఇనుపచట్రంలో ఇమిడి, నలిగి
మనసుల్ని చంపేసుకుని
బతుకుల్ని బలిచేసుకునే
అభాగ్యజీవులెందరో !
స్వచ్ఛమైన మనసుతో పరస్పరం ప్రేమించుకొని
స్వేచ్చా విహంగాల్లా ఒకరిపై ఒకరు మనసు పారేసుకొని
జ్ఞానంతోనో, అజ్ఞానంతోనో
ఒకరిపై ఒకరు త్యాగం చేసుకొని
బతికే ప్రేమైక జీవులు ఎందరో !
అలాంటివారికి
ఇంకా
తనేమిటో, నేనేమిటో పూర్తిగా తెలియక
భవిష్యత్తును ఊహించక
బతుకింతే అనుకుంటూ
నన్నీసాహితీ సముద్రంలో పడవేసి దూరంగా ఉన్న
ఓ స్నేహామయికి
ప్రేమమయికి
ప్రేమతో

No comments:

Post a Comment