Wednesday, October 31, 2012

నువ్వు లేక నేను లేను................

నా మనసు భావాలు నీ మాటల పలుకులవుతుంటే 
మౌనమే నా భాష కాదా!!

నువ్వు నా పక్కన ఉంటే
వసంతం రాకపోకల గురించి నాకెందుకు?
నీ కురులు సుతారంగా మోమును తాకిన వేళనన్ను నేనే మైమరచి పోయా
మనం మరింత దగ్గరైనప్పుడు
నీ శ్శాస రుచిని కూడా చూడగలను నేను
నీ చేతి స్పర్శ ఎన్నో భావాలు పలుకగలదు
 భావాలు అందుకున్న నా మనసు ఒక్కసారిగా తేలికైపోదూ!!!
ఇన్నాళ్ళకు మనల్ని విడదీయడం ద్వారాకాలం తన అక్కసుని వెళ్ళగక్కింది
నువ్వు లేని ఒంటరితనం లో
నేను ఉన్నా లేనట్టే...........

Monday, October 29, 2012

నేను నీకు నచ్చలేదు కదూ?

నన్ను సరిగ్గా చూడు  
నేను నీకు నచ్చలేదు కదూ?..

మరెందుకు నువ్వు నా వెంటే వున్నావు 
మరొక్క సారి ఆలోచించు 

నన్నొదిలే అవకాసం నీకెప్పుడూ నేనిచ్చా 
మరెందుకిలా నిత్యం నా వెంటే?

నీకు నచ్చినట్లు నేను లేనని 
నిరంతరం నన్ను నిలదీస్తావు 

నాకు నచ్చినట్లు నువ్వు లేవని 
నేనెప్పుడైనా నిన్ను నిందిచానా?

నీకు నచ్చేటట్లు నేను మారితే 
నాకు నేనే నచ్చను..

అప్పుడు నేను కూడా నీలాగే 
నిరంతరం నిట్టూరుస్తూ
నిప్పులు చెరుగుతూ వుంటాను 

అందుకే నేను నాలానే వుంటాను 
అప్పుడప్పుడు నీకు నచ్చకున్నా
నాకు నేను ఎప్పుడూ నచ్చుతాను ...

నీకోసం నువ్వు చెప్పినట్లు మారలేను 
నీకు అప్పుడప్పుడు నువ్వు నచ్చకపోయినా
నేను నాకు ఎప్పుడూ నచ్చుతాను

నాతో అప్పుడప్పుడు వుండే నీకోసం
నాతో ఎప్పుడూ వుండే నేను మారలేను

నేను నీకు నచ్చలేదు కదూ?
నిజానికి అది నా సమస్య కాదు..
నీదే?...ముమ్మాటికి... నీదే?....

మాతృ హృదయం.....

నవమాసాలు మోసి నడక నమ్రత  నేర్పుతుంది..
కలత చెందితే నిద్రహారాలు మాని కంటికి రెప్పలా కాపాడుతుంది..
కలవరమెందుకురా కన్నా అంటూ గుండెలో పోదువుకుంటుంది.
పసిబిడ్డ పసిడీ మోము చూసి దిస్టి తగులుతుందని కంటికి కాటుక తీసి 
పాలు గారు బుగ్గలపై దిస్టి చుక్కను దిద్దుతుంది. 
మాతృ హృదయం భరోసాతో కలత తీరి
 కమ్మని కలలో ఆడుతూ కంటి నిండుగా నిదురపోతుంది బిడ్డ..!!!

Saturday, October 20, 2012

kavitha

నా కవిత్వానికి గుక్కెడు కన్నిళ్ళ విలువ తెలుసు నా కవిత్వానికి పిడికెడు ఆనందాక్షణలు తెలుసు నా కవిత్వానికి ప్రశ్నించటం తెలుసు నా కవిత్వానికి బదులివ్వటము తెలుసు నా కవిత్వానికి తలెత్తి నిలబడటం తెలుసు ఏ అస్తిత్వానికి లోనుకానీది నా కవిత్వం ఏ బంధానికి ఏ అనుబంధానికి మరే బావబంధానికి లొంగిపొంది నా కవిత్వం బాధో ఆనందమో , కష్టాలో నష్టాà ��ో,రాజకీయాలో ఆరాచకియాలో అన్నీ కాగితంపై కవితక్షరాలై ముద్రించబడతాయ్.. నా కవిత్వం గూడు లెనివడికి నీడనిస్తున్ది, నా కవిత్వం కూడు లేని వాడికి ముద్ద పెడుతుంది, నా కవిత్వం నీలకాశపు తాను చించి వివస్థ్రల వస్త్రం అవుతుంది .. నా కవిత్వం వెన్నెలై వెలుగునిస్తుంది, చినుకై గొంతు తడుపుతుంది.. నా కవిత్వం రాబంధుమానవుల గుండెల్లో ఉరుమై భయం నింపుతుంది.. అసలు విటన్నిటికన్నా నా కవిత్వానికి మానవత్వం ఉంది.. 

Happy New Year


Happy New Year

ఎటు చూసినా కటిక దారిద్ర్యం,
అడుగడుగునా అవినీతిమయం,
నలువైపులా నరమేధం,
అయినా సరే...... Happy New Year ..... ! ! ! !

ఎరుపెక్కిన సంద్రం,
కన్నీరు మ్రింగిన ఎడారి,
జనారణ్యంలో ఆమ్లవర్షం,
అయినా సరే...... Happy New Year ..... ! ! ! !

ముంబాయికి బుల్లెట్ గాయాలు,
పాలస్తీనాలో భవనపు శకలాలు,
స్వప్న లోకంలో రక్త కన్నీరు,
అయినా సరే...... Happy New Year ..... ! ! ! !

ఎవరేమయినా నీకెందుకు.. ! !
ఏదేమయినా నాకెందుకు.. ! !
నీవు నేనూ బ్రతికుంటే,
ప్రతి రోజు ...... Happy New Year ..... ! ! ! !

నీ కోసమై ఎదురు చూస్తూ.........


Friday, October 19, 2012

బతుకమ్మ పండుగ




ఇద్దరక్క చెల్లెళ్ల ఉయ్యాలో
ఒక్కూరికిస్తే ఉయ్యాలో
ఒక్కడే మాయన్న ఉయ్యాలో
వచ్చెన్నపోడాయే ఉయ్యాలో
ఎట్లొత్తు చెల్లెలా ఉయ్యాలో
ఏరడ్డమాయె ఉయ్యాలో
ఏరుకు ఎంపల్లె ఉయ్యాలో
తలుపులడ్డమాయె ఉయ్యాలో
తలుపులకు తాళాలు ఉయ్యాలో
వెండియే చీలలు ఉయ్యాలో


వెండి చీలలకింద ఉయ్యాలో
వెలపత్తి చెట్టు ఉయ్యాలో
వెలపత్తి చెట్టుకు ఉయ్యాలో
ఏడుగింజల పత్తి ఉయ్యాలో
ఏడుగింజలపత్తి ఉయ్యాలో
తక్కేడు పత్తి ఉయ్యాలో
ఆ పత్తి తీసుకుని ఉయ్యాలో
ఏడికి పోయిరి ఉయ్యాలో
పాలపాల పత్తి ఉయ్యాలో
పావురాయి పత్తి ఉయ్యాలో
తెల్లతెల్ల పత్తి ఉయ్యాలో
బంగారు పత్తి ఉయ్యాలో
ముసల్ది వడికింది ఉయ్యాలో
ముద్దుల పత్తి ఉయ్యాలో
వయసుది వడికింది ఉయ్యాలో
వన్నెల పత్తి ఉయ్యాలో

చిన్నది వడికింది ఉయ్యాలో
చిన్నెల్ల పత్తి ఉయ్యాలో
ఆ పత్తి ఈ పత్తి ఉయ్యాలో
సాలె చింతల కాడ ఉయ్యాలో
సాలె చింతల కింద ఉయ్యాలో
సంగడి సారెన్న ఉయ్యాలో
సంగడి సారెన్న ఉయ్యాలో
సాగదీయబట్టె ఉయ్యాలో
సాలోడు వడికినా ఉయ్యాలో
నెలకొక్కపోగు ఉయ్యాలో
దిగెనే ఆచీర ఉయ్యాలో

దివిటీల మీద ఉయ్యాలో
ఆచీర కట్టుకుని ఉయ్యాలో
కొంగల బావికి ఉయ్యాలో
నీళ్లకంటూ బోతే ఉయ్యాలో
కొంగలన్నీ చేరి ఉయ్యాలో
కొంగంత చూసే ఉయ్యాలో
ఆ చీరగట్టుకుని ఉయ్యాలో
హంసలబాయికి ఉయ్యాలో
నీళ్లకంటూ బోతే ఉయ్యాలో
హంసలన్నీ గూడి ఉయ్యాలో
అంచంత జూసే ఉయ్యాలో
ఆ చీరగట్టుకుని ఉయ్యాలో
పట్నంబు బోతినో ఉయ్యాలో
పట్నంబు బోతినా ఉయ్యాలో
కొంగుబంగారమే ఉయ్యాలో
అన్నరో ఓయన్న ఉయ్యాలో
అన్నరో పెద్దన్న ఉయ్యాలో
ఏడాదికోసారి ఉయ్యాలో


బతుకమ్మ పండుగ ఉయ్యాలో
ఆడపిల్లనన్న ఉయ్యాలో
నేను ఉన్న చూడు ఉయ్యాలో
కలిగెనే పెద్దమ్మ ఉయ్యాలో
కన్నతల్లున్నదా ఉయ్యాలో
ఏడంతరాలదే ఉయ్యాలో
తీరైన బతుకమ్మ ఉయ్యాలో
వారిద్దరిత్తురా ఉయ్యాలో
వీరిద్దరిత్తురా ఉయ్యాలో
సంవత్సరానికే ఉయ్యాలో
ఒక్కసారి తల్లి ఉయ్యాలో
మళ్లిరా బతుకమ్మ ఉయ్యాలో
మళ్లీ రావమ్మ ఉయ్యాలో

జీవితం- మరణం -ప్రేమ ..!


జీవితం...
ఇచ్చినదాన్ని పొందాలంటే
మనమూ దానికి కొంత ఇవ్వాలి

అది ఏదయినా, ఎంతయినా
తప్పక ఇవ్వాల్సిందే
ఒకదాన్ని పొందాలంటే
ఇంకోదాన్ని వదిలేయాల్సిందే..!

జీవితం...
పట్టరాని సంతోషాన్నిస్తే...

రోదనలు, వేదనలు..
కష్టాలు, నష్టాలు...
కన్నీళ్ళు, కడగండ్లు..
అన్నీ దానికిచ్చేస్తాం

శాంతి, సంతోషాలు
నవ్వులు, పువ్వులు
ఆశలు, అనుబంధాలు
అన్నీ తిరిగి తెచ్చుకుంటాం..!

జీవితం...
ఓ పసిబిడ్డలాంటిది
కల్మషం లేని నవ్వులాంటిది
అందుకే...
మరణం అమరత్వపు ఖ్యాతి అయితే,
జీవితం మరణంలేని ప్రేమకు ఖ్యాతి...!

తెలంగాణా బతుకమ్మా..


మము గాచే తల్లి ఓ బతుకమ్మా..
దీవించు తల్లి..గౌరీ బతుకమ్మా..
మా కోర్కె వినవేమే, తల్లీ బతుకమ్మా..
తెలంగాణా ఇయ్యవే, గౌరీ బతుకమ్మా..
మా పిల్లాజెల్లాలు తల్లీ బతుకమ్మా..

మా నేల తల్లంటూ గౌరీ బతుకమ్మా..

ఒక్కొక్క పూవోలె, తల్లీ బతుకమ్మా..
రాలిపోయి నారే, గౌరీ బతుకమ్మా..
వాళ్ళ ఆశల్నే ఇలా పేర్చామే బతుకమ్మా..
అమర స్తూపమై పోయెనే బతుకమ్మా..
మము గాచే తల్లి ఓ బతుకమ్మా..
దీవించు తల్లి..గౌరీ బతుకమ్మా..
**********************

నీకై తడిసిన కంటితో..


కళ్ళ ముందు కలవై తిరుగుతున్న కలుసుకోలేకున్నా..
తిరిగిరావన్న నిజం నాతో వున్నా గమ్యం మార్చుకోలెకున్నా..
మాయచేసి మోసగించినా నిన్ను మరచిపొలేకున్నా..
ప్రేమ మిగిల్చిన చేదు చరిత్రను కన్నీటి కావ్యంలా రచిస్తునా..
నీ ఎడబాటుతో మోడుబారిన మనిషల్లే బతికేస్తున్నా..
గుండెను గాయం చేసినా నవ్వుకొంటూ ఆనందంగా బరిస్తున్నా..
నీ నవ్వు,మాట,నీ రాక మాయ అని తెలిసి సహించలెకున్నా..
కనుమరుగయ్యావని తెలిసి కన్నీరు కారుస్తూన్నా..
నువ్వు కాదన్నా నీ రాకకొసం గుమ్మం వైపు ఎదురుచూస్తున్నా.. 
వెంటరాని మరణం వెంట పరుగులు తీస్తున్న..

తెలిసి ఇన్ని తప్పులు చేస్తున్నా అడగవేం ఒక్కసారైన..

Tuesday, October 16, 2012

హృదయ స్పందన గా రావా......


"మనసంతా నిండి మరువని ఙాపకానివై దాగి కనిపించవా
గుండె సెగలతో కంటి తడిలో ఎండమావివైనావా

నీ పిలుపుకై వేచి ఉన్న వీనులకి వినిపించవా
మరుమాటే లేని మౌనం లో నేడు మూగవైనావా

తొలిపొద్దులో తెలిమంచులో తుషారమై రావా
నీవు లేని నిశిరాతిరి లో నా హృదయాగ్ని జ్వాలలనార్పవా


మానసదేవతకి హృదయనైవేద్యం నా నేరమంటావా
దర్శనమీయక కనులకి దూరమై ఇలా శిక్ష వేశావా

నీ ఎడబాటే తీర్చగా నవ వసంత  సమీరమై రావా
మోహనరాగమై నా మది వీణా తంత్రుల మీటవా

నీ వదనమనే తామర పూసిన మానస సరోవరమునకు భ్రమరమ్మై రావా 
సుమధుర మధు మందార మిళితమైన నా ప్రేమామృత సుధాధారల గ్రోలవా


రవికిరణం పై పడి మెరిసిన హిమబిందువు నీ ముక్కుపుడకై తోచె
విమల కోమల ధవళ వర్ణపు సంపంగి నీ నాసిక గా కనిపించె
గల గల పారే సెలయేటి ప్రవాహ చప్పుడు నీ పలుకులు గా వినిపించె
సుధాకర తేజ స్పర్శితలై విరిసిన కలువలు నీ కన్నుల అసూయ నొందె 

పురివిప్పి మయూరం నాట్యమాడగా జేయు నల్లని మబ్బులు నీ కురులు గా తోచె
మలయమారుత పవనం ఏకాంతవేళ నను తాకగా నీ తొలిస్పర్శ మది మెరసి వేధించె

తిమిరాంతకమై ఉదయించే అరుణకిరణమై
చెక్కిలి మీటగ పలకరించే సాయంత్రపు పవనమై  రావా

నీపై వీచిన గాలికి సుగంధమే అంటగా
తన సాటి మరి ఎవ్వరనే మల్లెల పొగరణచగా 

నాలో నిను వెతికే శ్వాస కి బదులు గా

ఉన్నావని తెలిపే హృదయ స్పందన గా రావా " ....

Saturday, October 13, 2012

ప్రేమ నన్నొదిలి దూరంగా వెళిపోతుంటే.......




....ప్రేమ నన్నొదిలి దూరంగా వెళిపోతుంటే, తను నాకు బహూకరించిన శూన్యం కనిపిస్తూ ఉంది, కారణమేమిటో తెలీదు కానీ శూన్యం కూడా చాలా అందంగా ఉంది.. ఎంతైనా నా ప్రేమ నాకు ఇచ్చిన బహుమానం కదా.. పాపం నన్ను ప్రేమించే ఒక హృదయంతో తాను పెనవేసుకుపోయి ప్రేమాన్నౌత్యం ఎలా ఉంటుందో చూపాలనుకుందేమో.. ఆ హృదయమేదీ ఎప్పటికీ దొరకక.. బరువెక్కిన నా హృదయానికి వీడ్కోలు చెబుతూ వెడలిపోయిం .. ప్రేమించే హృదయం లేదని ప్రేమే నన్నొదిలెళ్ళీపోతే.. ప్రేమే లేని చోటుకి ఒక ప్రేమించే హృదయం ఎలా చేరుతుందో... ఎందుకు చేరాలని అడిగితే.. మౌనమే నా భాషగా చనిపోయిన చిరు నవ్వుని సమాధానంగా ఇవ్వాలేమో.....

Friday, October 12, 2012

మరుజన్మలోను నా చేయి అందుకుంటావా.....!!


నీ స్వరం విన్న నా మనసు ఏవేవో....... 
చెప్పాలనుకుంటే నా మాటలు మూగబోయనే.....
నీ చూపులు నను సోకగా........... 
నా కలలు రెప్పల కౌగిలిలో నిలిచనే.....
నీ ఉహాలు నా చెంతకి వస్తుంటే....... 
నా కన్నె సొగసు వికసించనే......
నీ రూపం గుర్తొచ్చిన తక్షణం...... 
నా పరువం పులకించినే.......
నీకోసం గుండెల్లో చోటు చేసి ఉంచా.....
నా ప్రేమను కాదనక ఒడి చేర్చుకుంటావా....
నీకోసం మరణాన్ని అయినా ఓడిస్తాను మరు..... 
జన్మలోను నా చేయి అందుకుంటావా.....!!

Wednesday, October 10, 2012

ఇట్లు నీ ప్రేమ…


మరణపు అంచున నిల్చున్నా సరే
  నీ తలపులతొనే నింపుతా నా హ్రిదయాన్ని…


   గుండె మూగబోయినా సరే నిలిపి ఉంచుతా నా కళ్ళల్లో కొన ఊపిరిని…
   కడ దాకా నీ రాక కోసం వేచి చూస్తూ ఇట్లు నీ ప్రేమ…

కలల అలల….

  కలల అలల మధ్య తేలుతూ ..
     కమ్మని ఊహల్లో  విహరిస్తూ…
కష్టాల సుడిగుండాలను దాటుతూ..
      ఆనందపు ఉప్పెనలను అనుభవిస్తూ..
ఏ తీరాన్ని చేరుతుందో ఈ జీవిత నావ..

నా గమ్యం



నా ఊహల్లో తను నిండిపొయింది
తన గుండెల్లో నన్ను దాచుకుంది
నా స్నేహం తాను అందుకుంది
తన లోకం నేనే అని అంది

నన్ను ఒక్కసారిగా తను వీడిపొయింది
మరల తిరిగి రాని లోకాలకు చేరిపోయింది
నా గమ్యం సూన్యం అయ్యింది
తను ఒంటరిగా నన్ను మిగిల్చింది

నేనూ తన దరిచేరతాను అంటే
తన ఙ్ఞాపకాలు నాకు తోడుంటాయని
నా ఊహాల్లొ తను ఎప్పుడు జీవిస్తానని
తను నన్ను వీడిపోతూ చివరిగా నాతో అంది

నా ఊహల్లో ఎల్లప్పుడు జీవించే నా నేస్తానికి
ఇది నేను అందించె ఒక కవితా కుసుమం
ఈ కుసుమ పరిమళాలు నా నేస్తనికి
చేరుతాయని ఆశతో ఎదురుచూస్తున్నాను..........

కొన్ని బతుకమ్మ పాటలు........



కొన్ని బతుకమ్మ పాటలు
బతుకమ్మ పండుగ ఎంత విశిష్టమైనదో బతుకమ్మ పాటలు అంత విలక్షణమైనవి. తెలంగాణా సంస్కృతికి ప్రతీకగా నిలిచే పండుగ బతుకమ్మ. ఆతరువాత స్థానం బోనాలది.
తెలంగాణ జాగృతి, ఆంధ్రజ్యోతి, టీవీ 9 కలిసి దేశవిదేశాల్లో బతుకమ్మ సంబరాలు నిర్వహించడం ఎంతో ముదావహం. తెలంగాణా జిల్లాల్లో, దేశ రాజధానిలోనే కాక దుబాయ్‌లో, అమెరికాలోని న్యూజెర్సీ, వాషింగ్‌టన్‌, బోస్టన్‌, చికాగో, కాలిఫోర్నియా వంటి నగరాల్లో ఈ సంబరాలు నిర్వహిస్తున్నారు. 

ఇదే క్రమంలో విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, కర్నూలు, అనంతపురం తదితర ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కూడా నిర్వహిస్తే మరింత బాగుండేది. ఆంధ్ర తెలంగాణా ప్రాంతాలు విలీనమై 54 ఏళ్లు కావస్తున్నా బతుకమ్మ పండుగ ఇప్పటికీ ఆంధ్రప్రాంతానికి పరాయి పండుగలాగే వుండిపోయింది. బతుకమ్మ పాటలు ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రతిధ్వనిస్తున్నాయి కానీ పక్కనే వున్న ఆంధ్రలో మచ్చుకు కూడా వినిపించకపోవడం విషాదం.

సరే, ఇదిలా వుంటే మొన్న మా పక్కింటి అమ్మాయి వచ్చి ''బతుకమ్మ పాటలు ఏవైనా నెట్‌లోంచి ప్రింట్‌అవుట్‌ తీసివ్వరా అంకుల్‌ పాడుకుంటాం'' అని అడిగింది. దాంతో పది ఇరవై పాటలతో చిన్న బుక్‌లెట్‌ తయారుచేసిద్దాం అని ఎంతో ఉత్సాహంగా వెతికాను. కానీ ఆశ్చర్యంగా నాకు కనీసం ఒక్క బతుకమ్మ పాట సాహిత్యం కూడా దొరకలేదు. తెలంగాణా జాగృతి వారి వెబ్‌సైట్‌కి వెళ్తే ... పాటల సంగతి అటుంచి అక్కడ అసలు తెలుగు అక్షరాలే కనిపించలేదు. మార్కెట్‌లో కూడా నాకు బతుకమ్మ పాటల పుస్తకాలు లభించలేదు. ఇంత పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్న ఈ తరుణంలో కూడా బతుకమ్మ పాటలు లభించకపోవడం బాధాకరంగా అనిపించింది. బతుకమ్మ వెబ్‌సైట్‌లోతెలంగాణా డెవలప్‌మెంట్‌ ఫోరం వెబ్‌సైట్‌లో, డిస్కవర్‌ తెలంగాణా వెబ్‌సైట్‌లో కొన్ని ఎంపి3 ఆడియో పాటలు మాత్రం కనిపించాయి. వాటిని డౌన్‌లోడ్‌ చేసుకుని ఓపిగ్గా వింటూ ఓ నాలుగు పాటలు టైప్‌చేసి ప్రింట్‌అవుట్‌ తీసి ఇచ్చి పరువు నిలబెట్టుకున్నాను. వాటినే దిగువన కూడా పొందు పరుస్తున్నాను. వీటిని పై వెబ్‌ సైట్‌లలో వినవచ్చు.

నేను సరిగ్గా వెతకలేదేమో అని అనుమానంగా వుంది. దయచేసి ఎవరైనా బతుకమ్మ పాటల జాడ తెలిస్తే సత్వరమే తెలుపవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. 


బంగారు బతుకమ్మ...

(ప్రధాన గాయని:)
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో 
బంగారు బతుకమ్మ ఉయ్యాలో !
(అందరూ:)
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో 
బంగారు బతుకమ్మ ఉయ్యాలో !!
(ప్రధాన గాయని పాడుతుంటే అందరూ లయబద్ధంగా చప్పట్లు కొడుతూ ''ఉయ్యాలో'' అంటుంటారు.)

ఆనాటి కాలాన ... ఉయ్యాలో! 
ధర్మాంగు డను రాజు ... ఉయ్యాలో! 
ఆరాజు భార్యయు ... ఉయ్యాలో! 
అతి సత్యవతి యంద్రు ... ఉయ్యాలో! 
నూరు నోములు నోమి ... ఉయ్యాలో! 
నూరు మందిని గాంచె ... ఉయ్యాలో!
వారు శూరు లయ్యి ... ఉయ్యాలో!
వైరులచె హత మైరి ... ఉయ్యాలో!

తల్లిదండ్రు లపుడు ... ఉయ్యాలో!
తరగని శోకమున ... ఉయ్యాలో!
ధన ధాన్యములను బాసి ... ఉయ్యాలో!
దాయాదులను బాసి ... ఉయ్యాలో!
వనితతో ఆ రాజు ... ఉయ్యాలో!
వనమందు నివసించె ... ఉయ్యాలో!
కలికి లక్ష్మిని గూర్చి ... ఉయ్యాలో!
జనకోసం బొనరింప ... ఉయ్యాలో! ....
....
ఊరికి ఉత్తరాన ..

(ప్రథాన గాయని పాడుతుంటే అందరూ లయబద్ధంగా చప్పట్టు కొడుతూ ''వలలో'' అంటుంటారు)

ఊరికి ఉత్తరానా ... వలలో 
ఊడాలా మర్రీ ... వలలో 
ఊడల మర్రి కిందా ... వలలో 
ఉత్తముడీ చవికే ... వలలో 
ఉత్తముని చవికేలో ... వలలో 
రత్నాల పందీరీ ... వలలో 
రత్తాల పందిట్లో ... వలలో
ముత్యాలా కొలిమీ ... వలలో

గిద్దెడు ముత్యాలా ... వలలో
గిలకాలా కొలిమీ ... వలలో
అరసోల ముత్యాలా ... వలలో 
అమరీనా కొలిమీ ... వలలో
సోలెడు ముత్యాలా ... వలలో 
చోద్యంపూ కొలిమీ ... వలలో 
తూమెడు ముత్యాలా ... వలలో 
తూగేనే కొలిమీ ... వలలో 
చద్దన్నమూ తీనీ ... వలలో 
సాగించూ కొలిమీ ... వలలో 
పాలన్నము దీనీ ... వలలో 
పట్టేనే కొలిమీ ... వలలో 
......

శ్రీలక్ష్మి నీ మహిమలు 

1: శ్రీలక్ష్మి నీ మహిమలూ గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా గౌరమ్మ
2: శ్రీలక్ష్మి నీ మహిమలూ గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా గౌరమ్మ
1: గౌరమ్మ చిత్రమై తోచునమ్మా
భారతీ దేవివై బ్రహ్మ కిల్లాలివై
2: భారతీ దేవివై బ్రహ్మ కిల్లాలివై

1: పార్వతీ దేవివై పరమేశు రాణివై
పరగ శ్రీలక్ష్మివైయ్యూ గౌరమ్మ
భార్య వైతివి హరికినీ గౌరమ్మ

2: శ్రీలక్ష్మి నీ మహిమలూ గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా గౌరమ్మ

1: ముక్కోటి దేవతలు సక్కనీ కాంతలు
ఎక్కువగ నిను గొల్చి పెక్కు నోములు నోచి
ఎక్కువా వారయ్యిరీ గౌరమ్మ
ఈలోకమున నుండియూ గౌరమ్మ

2: శ్రీలక్ష్మి నీ మహిమలూ గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా గౌరమ్మ .... //శ్రీలక్ష్మి//
....

చిత్తూ చిత్తూల బొమ్మ 

1: చిత్తూ చిత్తూల బొమ్మ శివుడీ ముద్దుల గుమ్మ
2: చిత్తూ చిత్తూల బొమ్మ శివుడీ ముద్దుల గుమ్మ
1: బంగారు బొమ్మ దొరికె నమ్మో ఈ వాడ లోన
2: బంగారు బొమ్మ దొరికె నమ్మో ఈ వాడ లోన
1: చిత్తూ చిత్తూల బొమ్మ శివుడీ ముద్దుల గుమ్మ
2: చిత్తూ చిత్తూల బొమ్మ శివుడీ ముద్దుల గుమ్మ
1: బంగారు బొమ్మ దొరికె నమ్మో ఈ వాడ లోన
2: బంగారు బొమ్మ దొరికె నమ్మో ఈ వాడ లోన

రాగీ బిందె దీస్క రమణీ నీళ్లాకు బోతె ... //రాగీ//
రాములోడు ఎదురాయె నమ్మో ఈ వాడ లోన... //రాము//
ముత్యాల బిందె దీస్క ముదితా నీళ్లాకు బోతె ... //ముత్యాల//
ముద్దు కృష్ణు డెదురాయె నమ్మో ఈ వాడలోన ... //ముద్దు//
వెండీ బిందె దీస్క వెలదీ నీళ్లాకు బోతె ... //వెండి//
వెంకటేశు డెదురాయె నమ్మో ఈ వాడలోన ...//వెంకటేశు//
పగడీ బిందె దీస్క పడతీ నీళ్లాకు బోతె ...//పగడీ//
పరమేశుడెదురాయె నమ్మో ఈ వాడలోన ...//పరమేశు//

1: చిత్తూ చిత్తూల బొమ్మ శివుడీ ముద్దుల గుమ్మ
2: చిత్తూ చిత్తూల బొమ్మ శివుడీ ముద్దుల గుమ్మ
1: బంగారు బొమ్మ దొరికె నమ్మో ఈ వాడ లోన
2: బంగారు బొమ్మ దొరికె నమ్మో ఈ వాడ లోన
....

రామ రామా రామ ఉయ్యాలో ... 

రామ రామా రామ ఉయ్యాలో! రామనే శ్రీరామ ఉయ్యాలో!!
రామ రామా నంది ఉయ్యాలో! రాగ మెత్తారాదు ఉయ్యాలో!!
రామ రామా రామ ఉయ్యాలో! రామనే శ్రీరామ ఉయ్యాలో!!
రామ రామా నంది ఉయ్యాలో! రాగ మెత్తారాదు ఉయ్యాలో !! //రామ రామా//

చారెడు బియ్యంలో ఉయ్యాలో! చారెడూ పప్పు పోసి ఉయ్యాలో!
చారెడు బియ్యంలో ఉయ్యాలో! చారెడూ పప్పు పోసి ఉయ్యాలో! 
చారెడు పప్పుపోసి ఉయ్యాలో! వన దేవుని తల్లి ఉయ్యాలో!
చారెడు పప్పుపోసి ఉయ్యాలో! వన దేవుని తల్లి ఉయ్యాలో! 
అక్కెమ్మ కేమొ ఉయ్యాలో! అన్నీ పెట్టింది ఉయ్యాలో! .....//అక్కెమ్మ కేమొ//
అప్పుడూ అక్కెమ్మ ఉయ్యాలో! తిన్నట్టు తిని ఉయ్యాలో! ....//అప్పుడూ//
తిన్నట్టు తినీ ఉయ్యాలో! పారేసినాది ఉయ్యాలో! //2//

పెద్దోడు రామన్న ఉయ్యాలో! బుద్ధిమంతుడాని ఉయ్యాలో! 2
ఏడు రోజుల్ల ఉయ్యాలో! చెల్లెరో అక్కెమ్మ ఉయ్యాలో! 2
అక్కెమ్మా కురులు ఉయ్యాలో! దురవాసినాయి ఉయ్యాలో! 2
అందరానికాడ ఉయ్యాలో! ఆకు అందుకోని ఉయ్యాలో! 2
ముట్టరాని కాడ ఉయ్యాలో! ముల్లు ముట్టుకోని ఉయ్యాలో! 2
పెద్ద నేలు రాత ఉయ్యాలో! పేరువాడా రాసి ఉయ్యాలో! 2
సిటికెనేలూ రాత ఉయ్యాలో! సిక్కువాడా రాసి ఉయ్యాలో! 2

రాకి గొంట బొయ్యి ఉయ్యాలో! రామన్న కిచ్చె ఉయ్యాలో! 2
కూసుండి రామన్న ఉయ్యాలో! రాకి గట్టుకోని ఉయ్యాలో! 2
రాయనాసి నచ్చి ఉయ్యాలో! పోయెనాసి నచ్చి ఉయ్యాలో! 2
బుడ్డెడూ నూనె ఉయ్యాలో! తీసుకా పోయింది ఉయ్యాలో! 2
చారెడంత నూనె ఉయ్యాలో! చదిరి తలకంటి ఉయ్యాలో! 2
కడివెడంత నూనె ఉయ్యాలో! కొట్టి తలకంటి ఉయ్యాలో! 2
గిద్దెడంత నూనె ఉయ్యాలో! గిద్ది తలకంటి ఉయ్యాలో! 2
ఆరసోడూ నూనె ఉయ్యాలో! అందంగ తలకంటి ఉయ్యాలో! 2
సోలెడూ నూనే ఉయ్యాలో! సోకిచ్చే తల ఉయ్యాలో! 2

వెండి దువ్వెనా ఉయ్యాలో! వెయ్యి చిక్కూతీసె ఉయ్యాలో! 2
తల్లి రావే తల్లి ఉయ్యాలో! తల్లిరో పెద్దమ్మ ఉయ్యాలో! 2
నాకునూ కష్టాలు ఉయ్యాలో! ఎందమ్మా తల్లి ఉయ్యాలో! 2
ఏమి కష్టాలనూ ఉయ్యాలో! తలపెట్టినావమ్మ ఉయ్యాలో! 2
పిడికెడంత మిరెము ఉయ్యాలో! కండ్లల్ల పోసె ఉయ్యాలో! 2
మంట అనీ అంటె ఉయ్యాలో! సంతోషపడుదును ఉయ్యాలో! 2
అట్లయిన మంచిదె ఉయ్యాలో! సప్పుడే చెయ్యదీ ఉయ్యాలో! 2

పొగాకు కండెమూ ఉయ్యాలో! తీసినాడు దేవుడూ ఉయ్యాలో! 2
కాళ్లకిందా యేసి ఉయ్యాలో! నలిపినాడుదేవుడు ఉయ్యాలో! 2
నశ్యమూ జేసిండు ఉయ్యాలో! ముక్కులాపెడ్టిండు ఉయ్యాలో! 2
ఒక్క తుమ్మన్న ఉయ్యాలో! తుమ్మినా గానీ ఉయ్యాలో! 2
నాయినీ భ్రమలూ ఉయ్యాలో! తీరునేమో గానీ ఉయ్యాలో! 2

రామ రామా రామ ఉయ్యాలో! రామనే శ్రీరామ ఉయ్యాలో!!
రామ రామా నంది ఉయ్యాలో! రాగ మెత్తారాదు ఉయ్యాలో!!
రామ రామా రామ ఉయ్యాలో! రామనే శ్రీరామ ఉయ్యాలో!!
రామ రామా నంది ఉయ్యాలో! రాగ మెత్తారాదు ఉయ్యాలో !!

ఏడున్నొక్క మేడలూ ఉయ్యాలో! కాలికూలాబట్టె ఉయ్యాలో! 2
ఏడు దొడ్ల బాసి ఉయ్యాలో! కాలికూలబట్టె ఉయ్యాలో! 2
బుచ్చపోళ్ల ఏసెమూ ఉయ్యాలో! సేసినాడు దేవుడు ఉయ్యాలో! 2
అక్కెమ్మ తల్లిగారు ఉయ్యాలో! ఏడువా బట్టిరీ ఉయ్యాలో! 2
ఏడువా బట్టిరీ ఉయ్యాలో! తూడువా బట్టిరీ ఉయ్యాలో! 2
సెల్లె నొక్క సేత ఉయ్యాలో! బల్లె మొక్క సేత ఉయ్యాలో! 2
పట్టుకోని అన్నలూ ఉయ్యాలో! ఏడువా బట్టిరీ ఉయ్యాలో! 2

ఏడుగురు అన్నలూ ఉయ్యాలో! చెల్లెనూ తీస్కోని ఉయ్యాలో! 2
చెల్లెనూ తీస్కోని ఉయ్యాలో! జంగలూ బాటనూ ఉయ్యాలో! 2
జంగలూ బాటనూ ఉయ్యాలో! అన్నలే బట్టిరీ ఉయ్యాలో! 2
ఉడుకుడుకు దుబ్బల్ల ఉయ్యాలో! నడుస్త ఉన్నరూ ఉయ్యాలో! 2
నడిచేటి కాళ్లకూ ఉయ్యాలో! పొక్కులొచ్చినాయి ఉయ్యాలో! 2

ఎండకాలం రోజు ఉయ్యాలో! దూపలూ కాబట్టె ఉయ్యాలో! 2
దూపైతాందాని ఉయ్యాలో! అంటలేరు మరి ఉయ్యాలో! 2
ఆకలైతాందనీ ఉయ్యాలో! అంటలేరు మరి ఉయ్యాలో! 2
వన దేవుని తల్లి ఉయ్యాలో! వనపున్నూ రాలు ఉయ్యాలో! 2
అప్పుడూ వనదేవుడు ఉయ్యాలో! ఏడుగురన్నలకూ ఉయ్యాలో! 2
ఏడుగురన్నలకూ ఉయ్యాలో! ఏడుపండ్లు ఇచ్చి ఉయ్యాలో! 2
అక్కెమ్మ కేమొ ఉయ్యాలో! వెన్న పండు యిచ్చె ఉయ్యాలో! 2
వెన్నె ముద్దపండు ఉయ్యాలో! పదాడబట్టింది ఉయ్యాలో! 2

ఏం పిల్లా నమ్మ ఉయ్యాలో! ఎందుకింతా గర్వం ఉయ్యాలో! 2
గొల్లాయినయి ఉయ్యాలో! పాలు తెచ్చినాడు ఉయ్యాలో! 2
ఏడుగురన్నలూ ఉయ్యాలో! పాలు తెచ్చినారు ఉయ్యాలో! 2
గిలాసెడూ పెరుగు ఉయ్యాలో! అక్కెమ్మ కిచ్చిండ్లు ఉయ్యాలో! 2
వనదేవుడేమొ ఉయ్యాలో! గొల్ల వేషంతోని ఉయ్యాలో! 2
గొల్ల వేషంతోని ఉయ్యాలో! వచ్చినాడనుకొని ఉయ్యాలో! 2
వచ్చినాడనుకొని ఉయ్యాలో! అక్కెమ్మగూడా ఉయ్యాలో! 2
అక్కెమ్మ గూడా ఉయ్యాలో! అయినా పెరుగునూ ఉయ్యాలో!2 
అయినా పెరుగునూ ఉయ్యాలో! పారా బోసింది ఉయ్యాలో! 2

చాలోడూ అయి ఉయ్యాలో! చీరెలూ తెచ్చిండు ఉయ్యాలో! 2
ఏడుగురు అన్నలకూ ఉయ్యాలో! ఏడు దోతులిచ్చి ఉయ్యాలో! 2
సన్నయి వొయ్యెలు ఉయ్యాలో! అక్కెమ్మ కిచ్చిండు ఉయ్యాలో! 2
నాకు ఎందుకాని ఉయ్యాలో! పారేసీనాది ఉయ్యాలో! 2
ఆయినీ సీరెలూ ఉయ్యాలో! తీసుకుంటేనేమొ ఉయ్యాలో! 2
తీసుకుంటెనేమొ ఉయ్యాలో! వనదేవునికేమొ ఉయ్యాలో! 2
వనదేవుని కేమొ ఉయ్యాలో! బ్రమలూ తీరునూ ఉయ్యాలో! 2

అట్లనన్న బ్రమ ఉయ్యాలో! తీరుననుకున్నడు ఉయ్యాలో! 2
అప్పుడూ అక్కమ్మ ఉయ్యాలో! ఆయినీ సీరెలను ఉయ్యాలో! 2
నాకు ఎందుకానీ ఉయ్యాలో! పారేసి నాది ఉయ్యాలో! 2
అట్లగాకపోతె ఉయ్యాలో! మరిఎట్ల జేతును ఉయ్యాలో! 2
తూర్పు దిక్కున ఉయ్యాలో! కొసినా కొరకలూ ఉయ్యాలో! 2
కోసినా కొరకలూ ఉయ్యాలో! పండుతాందీ పిల్ల ఉయ్యాలో! 2
ఆ పంట కోసమూ ఉయ్యాలో! మీ అన్నదమ్ములూ ఉయ్యాలో! 2
మీ అన్నదమ్ములూ ఉయ్యాలో! పోతారు పిల్ల ఉయ్యాలో! 2

రామ రామా రామ ఉయ్యాలో! రామనే శ్రీరామ ఉయ్యాలో!!
రామ రామా నంది ఉయ్యాలో! రాగ మెత్తారాదు ఉయ్యాలో!!
రామ రామా రామ ఉయ్యాలో! రామనే శ్రీరామ ఉయ్యాలో!!
రామ రామా నంది ఉయ్యాలో! రాగ మెత్తారాదు ఉయ్యాలో !!

ఊల్లెకూ మీరు ఉయ్యాలో! చేరవచ్చే నేమొ ఉయ్యాలో! 2
సుంకరోన్నయి ఉయ్యాలో! నేను వస్తా పిల్ల ఉయ్యాలో! 2
మీ ఏడుగురన్నలూ ఉయ్యాలో! మనిషి కొక్కా దెబ్బ ఉయ్యాలో! 2