చిన్న పిల్లల కనిపారేసే తల్లి దండ్రుల్లారా
ఏమి నేరం చేశామో మోము
ఏమి నేరం చేశామో ఎందుకని మము కన్నరు...చెత్త కుప్పల వేశారు...
వళ్ళు మరిచిన వయస్సుతోటి తుళ్ళీ పడతారు..కామందు లుగా మారి మము కంటారు..
రాబందుల మాదిరి మమ్ము పుట్టగానే చంపేస్తారు..
కాలేజీ చదువుల కెళ్ళి ప్రేమలో పడతారు..గుట్టుగా మము కని పారేసి చేతులు దులుపుకుంటారు...
అబ్బాయే కావాలంటూ ఆశా పడతారు..మరి అమ్మాయి పుట్టిందంటే వెంటనే నిరాశ పడతారు..
స్కానింగులో అమ్మాయి అంటే అయ్యే అంటారు..
అభార్షన్ పేరుతో మము భ్రూణ హత్యలు చేస్తారు....
సైబర్ కేఫ్ ల పబ్బుల క్లబ్బులో చిందులు ఆడేరు...
మరి విందుల పేరుతో ఇంటికి పిలిచి సరసాలాడేరు హైటెక్ వ్యభిచారం చేస్తూ హద్దులు దాటేసి హై క్లాస్ హస్పత్రిలో మమ్ము కంటారు.
.అమ్మా అని అరవక ముందే అవతల విసిరి వేస్తారు..
మము అనథ బాలలను చేస్తారు...
చిన్న పిల్లల కనిపారేసే తల్లి తండ్రుల్లారా వింటరా ఒక మాట చెబుతాము మా నోట పసిపాపలను కని పారేసే పాపులుగా మరకండి మీ తప్పులు దిద్దుకొండి పిల్లలను పెంచుకొండీ...

No comments:
Post a Comment