Wednesday, October 3, 2012

"ప్రేమ"..............


మొదటిసారి నిన్ను చూడాగానే కొమ్మకి పువ్వు పూసినట్టు,నా గుండెకు నువ్వు పుచావు.ఈ తొలిచూపు నీ మీద కోకిలాల వాలగానె నా మనసు పాట నీకు వినిపించే ఉంటుంది.రోజు నేలమీద సిగ్గుల్ని ఏరుకుంటున్న నీ చూపులు కనీసం నా హృదయం వరకైనా పోనిస్తావని ుదురు చూస్తుంటాను....కానీ వంగిన ఇంద్రధనుస్సులా నువ్వు ఆ గాలికి రంగులు పూస్తు నడిసిపోతావు....నిత్యం నీ తలపుల్లో తేలుతున్న ప్రాణాలు ప్రతి శ్వాసకు నీ పేరే పెడుతున్నాయి .అద్దం నన్ను చుపించదు,ప్రతి అబద్దం నిజంలా తోస్తుంది...రోజు నడిచిన దారే నన్ను తికమక పెడుతుంది,అంత వరకు నేను ఒంటరి వాడినన్న రహస్యాన్ని నువ్వు ఒక్కసారిగా గుర్తు చేస్తావు .నా అడుగుల పక్కన నీ పాద ముద్రల కోసం ఆశగా వెతుకుతుంటాను.ఎపుడు లేనంతగా నాకు  నేనే కొత్తగా కనిపిస్తున్నాను..!ఇదంతా నీ మాయే ?అసలు నిన్ను నా కళ్ళల్లో కొలువుంచినందుకేగా ...ఏ రేయి నాకు జోల పాడటం లేదు .ఇంత వరకు సాహసించి "హలో" కూడా అనలేక ఊహాలో తేలుతున్న భావాలు ఇప్పుడు అక్షరాలుగా మారుతున్నాయి .ఇన్నాళ్ళు ప్రేమంటే రెండక్షరాల  పథమనుకున్న... కానీ..!రెండు మనసుల్ని కలిపే   పథమనుకోలేదు...ఇప్పుడు మాత్రం నేను "ప్రే" అనే ఒకే అక్షరమై నీరిక్షిస్తున్నాను ..."మ"నసుంటే నా పక్కన నిలబడి "ప్రేమ"గా నా అక్షరానికి రూపన్నివ్వు........ 

No comments:

Post a Comment