Sunday, October 7, 2012

ప్రేమికుడు పారిపోయాడు


కాలేజికి బయలుదేరుతుండగా ఎదురింట్లో కొత్త అమ్మాయిని చూసి ఆశ్చర్య పోయాను.
చాల అందం గా ఉంది.
ఎవరబ్బా! అనుకున్నాను.
తెలుసుకోవడం ఎలా అని ఆలోచిస్తూ కాలేజికి వెళ్ళాను.కాని నా మనసు మాత్రం ఇంటిదగ్గరే వదిలేసాను

లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్లు మొదటి చూపులోనే ఆ అమ్మాయి ఎందుకో చాల బాగా నచ్చేసింది .కాలేజి లో ఉండ బుద్ధి కాలేదు.లాస్ట్ అవర్ ఎగ్గొట్టి మరీ ఇంటికొచ్చేసాను.
గుమ్మంలో ఆ అమ్మాయిని చూసాను.నన్ను చూసి చిన్నగా నవ్వింది  .  నాలో ఏది కలవరింత .మనసులో ఏదో పులకరింత .హృదిని కదిలించే భావాలు.మదిని కరిగించే ఊహలు.కట్టిపడేసే కాటుక కళ్ళు నన్ను ప్రేమ మైకం లో తీసుకెళ్ళాయి.నాలో ఏవో ప్రేమ ఉహాలు చెలరేగాయి.
ఆ అమ్మాయి నాకు నచ్చింది.ఎలాగైనా ఆ అమ్మయిని ప్రేమించాలనుకుని డిసైడ్ అయిపోయాను.
గదిలోకి వెళ్ళగానే ఆత్రుతగా చెల్లిని పిలిచి “ఆ అమ్మాయి ఎవ్వరని” అడిగాను .
“కొత్తగా వచ్చారు .ఆ అమ్మాయి పేరు కావ్య అట .వాళ్ళ నాన్నగారు బ్యాంకు లో ఉద్యోగమట ఈ వూరు ట్రాన్స్ ఫర్  మీద వచ్చారు “చెప్పింది చెల్లి .  ఆ అమ్మాయి పేరు తెలుసుకున్నందుకు మనసులో తెగ సంబరపడిపోయాను .
ఊహాలోకం లో విహరించాను.
ప్రేమ గూడు అల్లుకున్నాను .కలలు కన్నాను.కొత్తగా ప్రేమలో దిగితే ఇలాగే ఉంటుంది కాబోలు.ఎలాగైనా కావ్యను ప్రేమించి తీరాలి .ఎలా అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాను .ఉదయమే లేచి డాబా పైకి వెళ్ళాను .  ఆ అమ్మాయి ఎప్పుడు కనపడుతుందా అని ?!.
బయటకు వచ్చింది తులసికోట చుట్టూ తిరిగి పూజ చేసింది .అప్పుడు అకస్మాత్తుగా నా వైపు చూసింది.నా కళ్ళు ఒక్కసారి కాంతి పుంజాలయ్యాయి.నన్ను చూసి చిరునవ్వు నవ్వుతు లోనికి వెళ్లిపోయింది.
నా మనసు నాలో లేదు.గాల్లో తేలినట్టుంది.
నన్ను  చూసి నవ్వింది… అంటే కావ్యను ఈజీగా ప్రేమలో పడెయ్యొచ్చు  అనుకున్నాను.
ట్రైల్స్ ఎలా వెయ్యల? అని ఆలోచనలో పడ్డాను.
తయారయ్యి కాలేజికి వెళ్ళాను.క్లాసులో పాటాలు అర్ధం కాలేదు.సినిమాలలో ప్రేమికుడు ఎలా ఉంటాడో అలాగే నేను ఉన్నాను.
సినిమాలు కూడా నిజమే అనిపించాయి.
సాయంత్రం ఇంటికొచ్చేసరికి కావ్య గుమ్మంలో కనపడలేదు.నా మనసు ఒక్కసారిగా కకావికలమైనది .ఎంతో ఆత్రుతగా కావ్యను చూడాలనే ఆశతో వచ్చాను.కనపడక పోయే సరికి ఏదోలా అనిపించింది.ఇంట్లోకి వెళ్ళాను.మా హాల్లో చెల్లిపక్కన కావ్య కూర్చుని ఉంది.
సంబ్రమాశ్చర్యాలకు లోనయ్యాను.వెయ్యి ఓల్టుల బల్బులా నా కళ్ళు మెరిసాయి. ఒళ్ళు పులకరించింది. ఎగిరి గంతేయ్యలనుకున్నాను .“అన్నయ్యా! ఈమె పేరు కా….”
“కావ్య ఎదురింటిలోఉంటున్నారు కదూ!యామె రైట్ ” చెల్లి ని చెప్పనీయకుండా నేనే అనేసాను.
కావ్య నవ్వింది.
“అబ్బో బయోడేటా బాగానే గుర్తుంది ” అంది చెల్లి..
“హాయ్ నా పేరు కార్తిక్ , గ్లాడ్ తో మీట్ యు “  పోజిస్తూ చెప్పాను.
కావ్య మరలా నవ్వింది కాని ఏమి బదులివ్వలేదు.
చెల్లి చెప్పింది “పాపం మాటలు రావు అన్నయ్యా ! మన మాటలు అర్ధం అవుతాయి. కాని మాటలాడలేదు “
ఆ మాటలిన్న నన్ను ఎవ్వరో గెంతేసినట్టయ్యింది.
గుది బండ బలంగా వచ్చి తగిలినట్టనిపిన్చింది.
మెదడు మొద్దుగా మారిపోయింది.
కాళ్ళ కింద భూమి అదురుతాది అంటారు నిజంగా నాకు అలానే అనిపిచింది.
నా మదిలో భూకంప ప్రకంపనాలు.
మనసు బీటలు తీసినట్టయ్యింది .
నాలో ఆలోచనలు సునామికేరటాల్ల కొట్టుకు పోయాయి .
నా ప్రేమ గూడు కూలిపోయింది.
నాలో ప్రేమికుడు పారిపోయాడు.
గదిలోకి వెళ్లి పడుకున్నాను. మనసు ముకిలిన్చినట్టయింది.
ఏవో భయంకర ఊహలు. ఆలోచనలు చెలరేగుతున్నాయ్.
ఇంతలో నా అంతరాత్మ నా ముందు ప్రత్యక్షమయ్యింది .
“నీకు ప్రేమ అంటే తెలుసా ?:ప్రశ్నించింది
నా దగ్గర సమాధానం లేదు
‘ప్రేమకు అందం చందాలుతో పనిలేదు.  మనసుతో పని. కాని నీకు అసలు మనసే లేదు తెలుసా “
‘…….’“నువ్వు ప్రేమకు అనర్హుడవు   . ప్రేమ వేరు , ఆకర్షణ వేరు, .   ముందు అది తెలుసుకో ! ఆకర్షననే ప్రేమగా భావించడం తప్పు .  అభిమానం , ఆకర్షణ . ప్రేమ , వేరు వేరు ఐనప్పటికీ  ఆ మూడు కలిస్తేనే ప్రేమ పుట్టుకొస్తుంది. నీది నిజమైన ప్రేమ కాదు..ని జమైన ప్రేమ ఒక్కసారే పుడుతుంది.ఒక్కసారే మరణిస్తుంది. ట్రూ లవ్ ఈజ్ ఫిక్షిడ్  అండ్ పర్మినెంట్. గుర్తుంచుకో !” నా అంతరాత్మ ఆత్మ ప్రభోధం చేసింది.
….. సిగ్గుగా అనిపించింది .
ఐనా కాని నా లో ప్రేమికుడు మాత్రం పారిపోయాడు .

No comments:

Post a Comment