ఒక్కూరికిస్తే ఉయ్యాలో
ఒక్కడే మాయన్న ఉయ్యాలో
వచ్చెన్నపోడాయే ఉయ్యాలో
ఎట్లొత్తు చెల్లెలా ఉయ్యాలో
ఏరడ్డమాయె ఉయ్యాలో
ఏరుకు ఎంపల్లె ఉయ్యాలో
తలుపులడ్డమాయె ఉయ్యాలో
తలుపులకు తాళాలు ఉయ్యాలో
వెండియే చీలలు ఉయ్యాలో

వెండి చీలలకింద ఉయ్యాలో
వెలపత్తి చెట్టు ఉయ్యాలో
వెలపత్తి చెట్టుకు ఉయ్యాలో
ఏడుగింజల పత్తి ఉయ్యాలో
ఏడుగింజలపత్తి ఉయ్యాలో
తక్కేడు పత్తి ఉయ్యాలో
ఆ పత్తి తీసుకుని ఉయ్యాలో
ఏడికి పోయిరి ఉయ్యాలో
పాలపాల పత్తి ఉయ్యాలో
పావురాయి పత్తి ఉయ్యాలో
తెల్లతెల్ల పత్తి ఉయ్యాలో
బంగారు పత్తి ఉయ్యాలో
ముసల్ది వడికింది ఉయ్యాలో
ముద్దుల పత్తి ఉయ్యాలో
వయసుది వడికింది ఉయ్యాలో
వన్నెల పత్తి ఉయ్యాలో
చిన్నది వడికింది ఉయ్యాలో
చిన్నెల్ల పత్తి ఉయ్యాలో
ఆ పత్తి ఈ పత్తి ఉయ్యాలో
సాలె చింతల కాడ ఉయ్యాలో
సాలె చింతల కింద ఉయ్యాలో
సంగడి సారెన్న ఉయ్యాలో
సంగడి సారెన్న ఉయ్యాలో
సాగదీయబట్టె ఉయ్యాలో
సాలోడు వడికినా ఉయ్యాలో
నెలకొక్కపోగు ఉయ్యాలో
దిగెనే ఆచీర ఉయ్యాలో

దివిటీల మీద ఉయ్యాలో
ఆచీర కట్టుకుని ఉయ్యాలో
కొంగల బావికి ఉయ్యాలో
నీళ్లకంటూ బోతే ఉయ్యాలో
కొంగలన్నీ చేరి ఉయ్యాలో
కొంగంత చూసే ఉయ్యాలో
ఆ చీరగట్టుకుని ఉయ్యాలో
హంసలబాయికి ఉయ్యాలో
నీళ్లకంటూ బోతే ఉయ్యాలో
హంసలన్నీ గూడి ఉయ్యాలో
అంచంత జూసే ఉయ్యాలో
ఆ చీరగట్టుకుని ఉయ్యాలో
పట్నంబు బోతినో ఉయ్యాలో
పట్నంబు బోతినా ఉయ్యాలో
కొంగుబంగారమే ఉయ్యాలో
అన్నరో ఓయన్న ఉయ్యాలో
అన్నరో పెద్దన్న ఉయ్యాలో
ఏడాదికోసారి ఉయ్యాలో

బతుకమ్మ పండుగ ఉయ్యాలో
ఆడపిల్లనన్న ఉయ్యాలో
నేను ఉన్న చూడు ఉయ్యాలో
కలిగెనే పెద్దమ్మ ఉయ్యాలో
కన్నతల్లున్నదా ఉయ్యాలో
ఏడంతరాలదే ఉయ్యాలో
తీరైన బతుకమ్మ ఉయ్యాలో
వారిద్దరిత్తురా ఉయ్యాలో
వీరిద్దరిత్తురా ఉయ్యాలో
సంవత్సరానికే ఉయ్యాలో
ఒక్కసారి తల్లి ఉయ్యాలో
మళ్లిరా బతుకమ్మ ఉయ్యాలో
మళ్లీ రావమ్మ ఉయ్యాలో
No comments:
Post a Comment