Wednesday, October 3, 2012

Duramavadam




ఇవాళ మళ్ళి నిన్ను ఒక్కసారి గుర్తు సెసుకోనివ్వు ...అశ్రువుల్ని ఆనంద భాష్పాలుగా మార్చుకోనివ్వు ...నువ్వు "ఎడబాటు రైలెక్కి పోతుంటే నా చూపులు పట్టాలుగా సాగి చితికిపోయాయి"....నీతొ  పాటు నా పెదాల చిరునవ్వుల్ని తుంచుకెల్లావు.....నా పాదాల పరుగుల్ని పట్టుకెల్లావు..నీకు  దూరమవడమంటే  చీ'కాటి'కి దగ్గర కావడమే కదా..!!! అక్షరాల్ని పోదువు కన్నా అందమైన కవిత్వం లాంటిది నీ పరిచయం ...నక్షత్రాల్ని పంచుతున్న అనంతాకాశపు అనునయం నీ స్నేహం ....మనసు తడిసినపుడల్లా మసకవారే చూపుల్లో నువ్వు తళుక్కు మంటావు ..మొగ్గలా ముడుచుకున్న ప్రతి జ్ఞాపకం ఓ ఏకాంత కిరణం సోకినప్పుడల్లా అనుభూతుల పరిమళంలో అందంగా విచ్చుకుంటుంది ...కాలేజీ పుస్తకాలు,కెరీయర్  కనుల ముందు కదలాడిన మనసు మాత్రం నీ కనుల వెంటపడుతుంది.ఇవాళ నేను నీ జ్ఞాపకాల నగరంలో దారి మరిచిన బాటసారిని ..!!! నీ నిష్క్రమణం ఎంతగా భాదిస్తుందో వెనుతిరిగే నా పాదాలకైనా తెలిసుండాలి ...లేదా !!నా తల పోతలకు, నేను రాసే కలంకు అయిన తెలిసుండాలి ..లేదా నా కనుపాపలకి .........

No comments:

Post a Comment