Tuesday, October 9, 2012

"నా పల్లె కన్నీటి కథలు"


"నా పల్లె కన్నీటి కథలు"

దగా పడిన నా బతుకుల గోస
దోపిడీ చేసిన వారికేం తెలుసు ?

నా మట్టి లోనే నన్ను కూలీ గా మార్చి
ప్రాజెక్టులను నా చేతులతో కట్టించి
నీరంతా దొసుకెల్లిన వారికేం తెలుసు నా కన్నీళ్ళ వ్యధ !

త్రాగు నీటి తోనే కనిపించని విషం తాగి 
అంగ వైకల్యం తో మోకాలి పై దేవుకుంటూ
నడుస్తూ గతుకుతున్న నా కుంతి బతుకుల తిప్పలు
నా ఓటు తో సీటేక్కి
పక పక నవ్వుతున్న వారికేం తెలుసు ??

నల్ల బంగారం తో నాకు వెలుగులు నింపుతామని
మైనులు అంటూ భూగర్బ గనులు అంటూ
సొరంగాలు తవ్వి కుప్పలు కుప్పలు గా పోసి
నా పల్ళేలన్నిటిని మాయం చేసి
నా జీవితాన్ని కారు చీకట్లో కి నెట్టిన
వారికేం తెలుసు "నా పల్లె కన్నీటి కథలు"

నా పొట్ట లోని పేగులను దారపు పోగులు గా చేసి
ఖద్ధరు బట్టలు నేస్తున్న
నా ఆకలి ధప్పుల జీవిత కష్టాలు
వాటిని దరించిన నేతలకేం తెలుసు ??

కరువు విలయతాండవం చేస్తే
బతుకుదెరువుకు ఎడారి దేశం కు ఎగిరి
విధి వంచనకు గురై విగత జీవులుగా
పెట్ట లో తిరిగి వస్తున్న గల్ఫ్ మృతుల


కుటుంబాల రోదన పాలకులు ఏమెరుగు ??

నా పల్లె కన్నీటి కథలు వినెదెవరు ??                    
నా పల్లె కష్టాలు తీరెది ఎన్నడు ???  

No comments:

Post a Comment