"మనసంతా నిండి మరువని ఙాపకానివై దాగి కనిపించవా
గుండె సెగలతో కంటి తడిలో ఎండమావివైనావా
నీ పిలుపుకై వేచి ఉన్న వీనులకి వినిపించవా
మరుమాటే లేని మౌనం లో నేడు మూగవైనావా
తొలిపొద్దులో తెలిమంచులో తుషారమై రావా
నీవు లేని నిశిరాతిరి లో నా హృదయాగ్ని జ్వాలలనార్పవా
మానసదేవతకి హృదయనైవేద్యం నా నేరమంటావా
దర్శనమీయక కనులకి దూరమై ఇలా శిక్ష వేశావా
నీ ఎడబాటే తీర్చగా నవ వసంత సమీరమై రావా
మోహనరాగమై నా మది వీణా తంత్రుల మీటవా
నీ వదనమనే తామర పూసిన మానస సరోవరమునకు భ్రమరమ్మై రావా
సుమధుర మధు మందార మిళితమైన నా ప్రేమామృత సుధాధారల గ్రోలవా
రవికిరణం పై పడి మెరిసిన హిమబిందువు నీ ముక్కుపుడకై తోచె
విమల కోమల ధవళ వర్ణపు సంపంగి నీ నాసిక గా కనిపించె
గల గల పారే సెలయేటి ప్రవాహ చప్పుడు నీ పలుకులు గా వినిపించె
సుధాకర తేజ స్పర్శితలై విరిసిన కలువలు నీ కన్నుల అసూయ నొందె
పురివిప్పి మయూరం నాట్యమాడగా జేయు నల్లని మబ్బులు నీ కురులు గా తోచె
మలయమారుత పవనం ఏకాంతవేళ నను తాకగా నీ తొలిస్పర్శ మది మెరసి వేధించె
తిమిరాంతకమై ఉదయించే అరుణకిరణమై
చెక్కిలి మీటగ పలకరించే సాయంత్రపు పవనమై రావా
నీపై వీచిన గాలికి సుగంధమే అంటగా
తన సాటి మరి ఎవ్వరనే మల్లెల పొగరణచగా
నాలో నిను వెతికే శ్వాస కి బదులు గా
ఉన్నావని తెలిపే హృదయ స్పందన గా రావా " ....
.jpg)
No comments:
Post a Comment