Sunday, September 23, 2012

నేనేం చేశాను పాపం........

బాసూ....
నేనేమి చేశాను పాపం
నాకెందుకు ఈ శాపం
నాలో లేదు లోపం
ఆలోచించండి కొంచెం

మీకై వేచి చూసి
మీ బరువుని మోసి
మిమ్మల్ని ఇళ్లకు చేరవేసి
ఇదేనా నేను చేసిన తప్పు
చెప్పండి గుండె మీద చెయ్యేసి

దూరం ఎంతైనా
ఎక్కేది ఎవరైనా
కష్టం ఎంతైనా
మీ కోసం పని చెయ్యడమే
నా తప్పైతే చెప్పండి ఒక్కరైనా

ఎవరు తప్పు చేసినా శిక్ష నాకా
ఎక్కడ తప్పు జరిగినా బాధ్యత నాదా
ఏమని చెప్పను నా బాధ
మంటల్లో కాలిపోతున్న నా ఆత్మ వ్యధ

ఇకనైనా ఆలోచించాలి మీ అందరూ
ఆవేశపడకూడదు ఏ ఒక్కరూ
నాపై కోపం చూపొద్దు ఎవ్వరూ
ఇది నిజం, మీ సేవకై పుట్టిన
నాపై ఇక మీరు దాడిచెయ్యరు

ఇట్లు మీ
అమాయకపు బస్సు

No comments:

Post a Comment