స్త్రీ మూర్తి
ప్రతి ఇంటా గృహలక్ష్మిగ నిలచిన ఓ వనితా
నీవు లేని ప్రపంచాన్ని ఊహించుట సాధ్యమా
ఓర్పు సహనం త్యాగం ఇవి అన్నీ నీ సొంతం
కారుణ్యం ప్రేమతత్వం నీలోనే నిక్షిప్తం
మొక్కవోని ధైర్యానికి శివాజీయే నిదర్శనం
అది నింపిన జిజాబాయి తల్లులకు ఆదర్శం
'తల్లి ఒడి - తొలి బడి' అను నానుడిని వినలేదా
నిరూపించు తర్కాణం ఇది ఒక్కటి చాలదా
స్ఫూర్తి మూర్తివి నీవు యుక్తి శక్తి నీ సొంతం
మాతృమూర్తిగ నిలిచే సామర్థ్యం నీ సొంతం
వనితలార మేల్కొనండి, అబలలుగా ఉండకండి
అడుగు ముందుకేయండి సబలలమని చాటండి
దేశం గర్వించదగ్గ స్త్రీమూర్తులు ఎందరో
వారి అడుగు జాడలలో మీరంతా నడవండి.....
.jpg)
No comments:
Post a Comment