Saturday, September 22, 2012

నా చూపు వైశాల్యాన్ని కుదిన్చేస్తావు..


ఏ నక్షత్రాలు మనసుపడి ఇచ్చాయి ఆ నవ్వుని నీకు…

మెరిసే సొగసైన పంటి వరుసతో..

నా ప్రాణాల్ని హాయిగా చెదరగొట్టే మాయతో..

వయసు బరువునంతా మోసే మెత్తటి పెదవులతో.. నవ్వు… నీ నవ్వు.. !


అసలు నీ నవ్వు ఒక్క అధరాల సొంతమా..?

అంత అందమూ వాటిదేనా..? కాదంటే కాదు.!

చూపే పెదవులే అంత అందం తో తరిస్తుంటే..

సృష్టించే హృదయం ఇంకా ఎంత అద్బుతమై ఉంటుంది..!

దాన్ని మోసుకొచ్చే ఆలోచన, తన అదృష్టమనుకుంటుంది..!


ఏదో ఈ లోకానికి తెలియని.. నేను ఓపలేని.. అనుభూతిని కళ్ళతో నా మనసులోకి అదుముతావు..
నువ్వు నవ్వినప్పుడు..

నీ పెదవులే ప్రపంచామనుకునేల నా చూపు వైశాల్యాన్ని కుదిన్చేస్తావు..

రక్తాన్ని ఆపి, శ్వాసని నీ ఆధీనం లోకి లోబరుచుకుంటావు..

ఇన్నీ అంత దూరం నుండే ఎలా చేస్తావు ..???

ముడుచుకుపోయినా ముద్దుగా ఉండే నీ చిన్ని గడ్డం.

ఎర్రని మెరుపులతో వెలిగే తీరిన బుగ్గలు.

ప్రాపంచిక అందాలన్నీ పూర్తయ్యేది నీ నవ్వుతో కలిపి చూస్తేనే కదా.. !

అన్ని దిక్కుల్లోను ఉదయిన్చగలిగే అద్బుతం నీ చిరునవ్వే కదా..!


అయనా..


నీ పెదవోంపు నా హృదయం లోకి ఓంపిన అనిర్జీవమైన సాగరంతో..

ఈ అక్షరాలని తడిపేదెంత..? ఓ చినుకంత..!!!!

No comments:

Post a Comment