Tuesday, September 18, 2012

చెలీ నీ నుదుట బొట్టు..

నేనామెను తొలిసారిగా చూసినప్పుడు అనుకున్నాను… ఏమా సౌందర్యం… ఏమా వినయం… OOPS తను నాకే సోంతమవ్వాలని… నేనా కాలేజీలో కంప్యూటర్ సైన్స్ విధ్యార్థిని… మొన్నటివరకూ ఆమె నాతో ఆ వేపచెట్టుకింద… ఈ రోజు ఇంకొకరితో అదే చెట్టుకింద నేనెవరో తెలియనట్టుగా… ఇప్పుడర్ధమయ్యింది పాలీమార్ఫిజమంటే ఏమిటో… తనను ఈ కాలేజీలో చేరినప్పటినుండి గమనిస్తున్నా… ఎవరినీ పట్టించుకోకుండా; చాలా గుంభనంగా ఉంటుంది… ఈ రోజు లుంబినీ పార్కులో చూసా తనని వేరొకరి ఒళ్ళో… ఇప్పుడర్ధమయ్యింది ఎన్కేప్స్యులేషన్ అంటే ఏమిటో… తను నాతో చాలా క్లోజ్‌గా ఉంటుంది… అమ్మానాన్నల సంగతి చెప్పింది… అక్కా చెల్లీ; అన్నా తమ్ముళ్ళ సంగతీ చెప్పింది… మరి ఎవరినన్నా ప్రేమిస్తున్నావా అంటే మాత్రం చెప్పలేదు… నువ్వే తెలుసుకోపో అంటూ ప్రహేళికనల్లింది… అప్పుడర్థమైంది అబ్స్ట్రేక్షన్ అంటే ఏమిటో… నాతో ఉన్నప్పుడు ఓ కన్నెపిల్లాలా… స్నేహితురాళ్లతో ఉన్నప్పుడు ఓ కొంటెపిల్లలా… తనవాళ్ళతో ఉన్నప్పుడు ఓ చిన్నపిల్లలా… తను మారిపోతున్నప్పుడల్లా నాకనిపిస్తుంది… డైనమిక్ బైండింగ్ అంటే ఏమిటో… ఈ రోజు ఆ చిన్నది బొట్టు పెట్టుకోలేదు ఎందుకో… నా మనసుకు వైధవ్యం ప్రాప్తించిందో ఏమిటో!

No comments:

Post a Comment