Tuesday, September 4, 2012

ఆడదనీ తెలిసిన వెనువెంటానే..

అమ్మ అనీ పిలువకముందే.. నాన్న అనీ చెయ్యి పట్టకముందే.. మీ అంతరాత్మనీ చంపుకోనీ.. నన్ను హత్య చేయకండీ.. నోరులేని ఈ జీవిని చూసీ.. లోకం తెలియనీ ఈ పసిపాపనీ చూసి.. నోరు ఉన్నా మీరు జాలి పడండి కాస్త.. జాలి లేనీ లోకం కాదు మనదీ.. మమతలు లేని మనషులం కాదు మనం.. అబార్షన్ పేరుతో నన్ను అంతం చేయకండీ.. ఆడదానికి పుట్టిన నాన్నవు నీవు.. ఆడదై పుట్టిన అమ్మవి నీవు.. ఆడదనీ తెలిసిన వెనువెంటానే.. ఆదిలోనే నన్ను చంపేయకండీ.. ఎందరో పుట్టిన పుణ్య భూమి మనదీ.. ఆడది లేకుంటే ఈ శృష్టి ఎక్కడిదీ.. అందుకే నన్ను చంపకండీ.. ఆదిలోనే నా గొంతు నలిమి వేయకండీ..

No comments:

Post a Comment