రంగురంగుల ప్రపంచం
రాగాలు పలికించె
ఎదనిండా మల్లెలువిరబూసి
నా ఆశలన్నీ పరిమళభరితమాయే ...
పరుగులు తీసింది కదలని అంతరంగం
పసిపాపనిచేసింది ప్రకృతి అందం
ఎగిరిగంతులు వేసిన నా హృదయం
ప్రకృతి ఒడిచేరింది ముద్దుమురిపాలకై ....
అడవినేర్పింది అందమయిన అమాయకత్వం
చల్లదనం చేరింది నా చింతలు తొలగించి
ముద్దుగా చేరువయ్యింది మానసికప్రపంచం
నా ముచ్చట తీర్చి నన్నలరించింది ....
ఏకమయిపోయా స్వేచ్చగా నిశ్సబ్దామృతంలో
ఎక్కడో లేదు అనిపించింది 'స్వర్గం'
ఇక్కడే తల్లి 'భూమి ఒడి' లోనే
ఒడిలో ఒదిగిన పసిపాపనైన నా 'మనసు'లో ......!! గిరి గౌడ్
.jpg)
No comments:
Post a Comment