Sunday, September 23, 2012

కలం కన్నీరు పెడుతుంది...


కలం కన్నీరు పెడుతుంది...
శ్రమజీవి స్వేదానికి
ఎర్రరంగు పూసిన రుదిరాన్ని
సిరాగా చూసినప్పుడు...
కలం కన్నీరు పెడుతుంది...

అభాగ్యురాలి...
కన్నీటి కథ రాస్తున్నప్పుడు
కలం కన్నీరు పెడుతుంది...
అగ్నిసాక్షిగ పెళ్ళాడినవాడు...
్గ్నికి ఆహుతి చేసినపుడు
కలం కన్నీరు పెడడుతుంది...
 
అమాయకపు పసిపాపల...
అపహరణ హత్యోదంతాలను రాస్తున్నప్పుడు
కలం కన్నీరు పెడుతుంది...

వికసించే పువ్వులపైన
యాసిడ్ వర్షం కురిసినప్పుడు
కలం కన్నీరు పెడుతుంది...
మరి ఆ పువ్వులు...కలిగే కన్యలయితె..
ఆ .. యాసిడ్ ప్రేమ రక్కసి కదా అని..
కలం కన్నీరు పెడుతుంది...

కష్టజీవి కష్టాన్ని దళారి దోచేస్తుంటే..
కలం కన్నీరు పెడుతుంది...
వికసించే పువ్వులేవని...
చిరుగాలిలో..గుభాళింపులేవని
కలం కన్నీరు పెడుతుంది...

అరణ్యాలు ఆక్రమణలకు గురై
సస్యశ్యామల ఎడారులైనపుడు?
కలం కన్నీరు పెడుతుంది...
తరాలెన్ని మారినా..
యుగాలెన్ని గడిచినా..
బడుగుజీవి బతుకు...
పరాధీనమేనని...
ఔను! కలానికీ మనసుంది...
అందుకే కన్నీరు పెడుతుంది
నేను కలంగా ఎందుకు పుట్టానని!

No comments:

Post a Comment