Friday, September 21, 2012

అమ్మ!!!!

ముత్యంమంత స్వచ్చమయిన మనసు .... మల్లెపువ్వంత మధురమయిన నవ్వు.... నీటి చుక్కంత నిర్మలమయిన రూపం... సముద్రమంత కడలిని దాచే చిన్న గుండె.. అలలై ఎగసే మన బాధలని ఆపాలనే ఆరాటం... అనంతమయిన విశ్వాన్ని అరచేతిలో చూపే ఆనందం.. కనుపాప తో ధైర్యం చెప్పే కావ్యత్వం... కనుచూపు తో శాసించే కోమలత్వం.....!!! సరి రాలేరు ఎవరూ ఈ రూపానికి .. సరి తూగాలేరు ఎవరూ ఈ మనసుకి.... అదే అమ్మ మనసు... చల్లని సముద్రం .. వెచ్చగా తగిలే గాలి ... మెల్ల గా వచ్చి పలకరించి వెళ్ళే అలల సవ్వడి ... మనసుకి ఎంత హాయి గా ఉంటాయో... నేను ఎక్కడున్నా ,నీవు ఎక్కడున్నా అమ్మ !!నిన్ను తలచుకున్న క్షణం లో , నీ వడిలో ఉన్నంత హాయిగా ఉంటుందమ్మా ...!! అమ్మ మనసు,అమ్మ వడి ఈ రెండిటికి ఎవీ సాటి రావు....!! కోరుకోదు ఏమీ ప్రేమ తప్ప... అడగదు ఏమీ ఆప్యాయత తప్ప... కష్ట పెట్టద్దు,బాధ పెట్టద్దు ఆ మనసుని... నిస్వార్ధమయిన ప్రేమ ఒక్కటే అమ్మ ప్రేమ...!!!

No comments:

Post a Comment