ఏ ప్రమాదం ఏ అంచులో దాగుందో,
ఎలా కనిపెట్టేది నేను?
బడికి పంపాలన్నా, గుడికి పంపాలన్నా,
ప్రాణం అరచేతేలో పెట్టుకునే,
ఎలా పంపేది నేను?
శాస్త్రీయంగా ఆకాశపు అంచులు తాకుతూ,
మానసికంగా పాతాళపు అంతుల్లో కూరుకుపోతూ,
పయనం సాగిస్తున్న నేటి తరంలో,
ఎందుకు భగవంతుడా నన్ను తల్లిని చేశావు?
మూడడుగులు ముందుకు,
నాలుగడుగులు వెనక్కి పోతున్న ఈ రోజుల్లో,
పురాతన కాలపు పరదా బతుకులే నయం అడబిడ్డకు,
అని తలపిస్తున్న ఈ రోజుల్లో,
ఎందుకు భగవంతుడా నన్ను తల్లిని చేశావు?
అక్షరాలు ధ్వనిస్తాయి, అక్షరాలు జ్వలిస్తాయి అక్షరాలు కదిలిస్తాయి, అక్షరాలు కరుణిస్తాయి అక్షరాలు అందంగా పొదిగితే గీతాల మాలికలవుతాయి, అక్షరాలగవాక్షాలౌతాయి సాహితీ పందిరికి తోరణాలై నిలుస్తాయి భాషకు, భావానికి నిచ్చెనలౌతాయి అక్షరాలు గుండె గుండెకు బాటలు వేస్తాయి ఎల్లలు తెలియని సీమలను కలిపివేస్తాయి అక్షరాలు అరుస్తాయి వేదనతో ఆనందంతో కేరింతలు కొడతాయి అక్షరాలు కవి గుండెల్లో కదులుతాయి......
Tuesday, September 18, 2012
ఎందుకు భగవంతుడా నన్ను తల్లిని చేశావు?
ఓ భగవంతుడా,
నన్ను తల్లిని చేశావు,
నవమాసాలు మోసే శక్తిని ఇచ్చావు,
బిడ్డను పెంచే ఓపికను ఇచ్చావు,
నా జన్మకు సార్ధకత్వాన్ని తెచ్చావు.
కానీ భగవంతుడా,
ఎలా కాపాడను నా బిడ్డను,
ఈ పాడు లోకంలో?
ఏ క్షణం ఎటునుంచి ఏ ఆపద వస్తుందో,
ఎలా తెలిసేది నాకు?
ఏ కామాంధుడు ఏ నిమిషాన్న కన్నేస్తాడో,
ఎలా కాపుకాసేది నేను?
ఏ ప్రమాదం ఏ అంచులో దాగుందో,
ఎలా కనిపెట్టేది నేను?
బడికి పంపాలన్నా, గుడికి పంపాలన్నా,
ప్రాణం అరచేతేలో పెట్టుకునే,
ఎలా పంపేది నేను?
శాస్త్రీయంగా ఆకాశపు అంచులు తాకుతూ,
మానసికంగా పాతాళపు అంతుల్లో కూరుకుపోతూ,
పయనం సాగిస్తున్న నేటి తరంలో,
ఎందుకు భగవంతుడా నన్ను తల్లిని చేశావు?
మూడడుగులు ముందుకు,
నాలుగడుగులు వెనక్కి పోతున్న ఈ రోజుల్లో,
పురాతన కాలపు పరదా బతుకులే నయం అడబిడ్డకు,
అని తలపిస్తున్న ఈ రోజుల్లో,
ఎందుకు భగవంతుడా నన్ను తల్లిని చేశావు?
ఏ ప్రమాదం ఏ అంచులో దాగుందో,
ఎలా కనిపెట్టేది నేను?
బడికి పంపాలన్నా, గుడికి పంపాలన్నా,
ప్రాణం అరచేతేలో పెట్టుకునే,
ఎలా పంపేది నేను?
శాస్త్రీయంగా ఆకాశపు అంచులు తాకుతూ,
మానసికంగా పాతాళపు అంతుల్లో కూరుకుపోతూ,
పయనం సాగిస్తున్న నేటి తరంలో,
ఎందుకు భగవంతుడా నన్ను తల్లిని చేశావు?
మూడడుగులు ముందుకు,
నాలుగడుగులు వెనక్కి పోతున్న ఈ రోజుల్లో,
పురాతన కాలపు పరదా బతుకులే నయం అడబిడ్డకు,
అని తలపిస్తున్న ఈ రోజుల్లో,
ఎందుకు భగవంతుడా నన్ను తల్లిని చేశావు?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment