తొలి దైవం “అమ్మ”
చెరగని చిరునవ్వు “అమ్మ”
తరగని ఓదార్పు “అమ్మ”
ఈ సృష్టిలో సర్వం “అమ్మ”
ఈ జీవన ప్రస్థానంలో చివరి పిలుపు “అమ్మే” !!
“అమ్మా” నీకు జిందాబాద్ & జేజేలు ..
అక్షరాలు ధ్వనిస్తాయి, అక్షరాలు జ్వలిస్తాయి అక్షరాలు కదిలిస్తాయి, అక్షరాలు కరుణిస్తాయి అక్షరాలు అందంగా పొదిగితే గీతాల మాలికలవుతాయి, అక్షరాలగవాక్షాలౌతాయి సాహితీ పందిరికి తోరణాలై నిలుస్తాయి భాషకు, భావానికి నిచ్చెనలౌతాయి అక్షరాలు గుండె గుండెకు బాటలు వేస్తాయి ఎల్లలు తెలియని సీమలను కలిపివేస్తాయి అక్షరాలు అరుస్తాయి వేదనతో ఆనందంతో కేరింతలు కొడతాయి అక్షరాలు కవి గుండెల్లో కదులుతాయి......
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment