Saturday, September 22, 2012

ఓ ఆడపిల్ల మనోవేదన.........


ఓ ఆడపిల్ల మనోవేదన

అమ్మకాల నడుమ నలిగే ప్రాణమున్న రాతి బొమ్మని,
భరించేవాడు వేలకడుతుంటే,
కన్నవాళ్ళు ఆ ధర చెల్లిస్తున్నారు,
ఏమాత్రం ఇది న్యాయం.
నిజానికి, నీతికి వున్న తేడా చెప్పిన వాళ్ళే,
నేను ఇది పాపం అని తెలిసిన నాకు ధర చెల్లిస్తున్నారు.
ఇనుప ముక్కలతో చేసిన ముళ్ళతో నా మనసు చంపేస్తున్నాడు నన్ను కట్టుకోబోయే వాడు,
కట్నం పేరుతో తనను తాను వంచించుకొంటున్నాడు.
ఎక్కడ పుట్టింది ఈ దురాచారం, ఎందుకు మన దేశానికి పట్టుకొమ్మ అయ్యింది.
ఉన్నవారి దగ్గరనుండి లేనివారు అనే భేదం లేకుండా అందరికి నట్టిల్లయ్యింది. 
మన శరీరానికి చిన్న వ్యాధి వస్తేనే బాగుచేయడానికి నానా రకాలుగా ప్రయత్నిస్తాం------
మరి మనసు మన శరీరంలో అతి ముఖ్యమైన భాగం.
మరి మనసుకు పట్టిన వ్యాధిని తొలగించలేమ......
ఇది చాలా మహమ్మారి ఈ వ్యాదికి బలైన వారు ఎదుటి వారి ప్రాణాలు సునాయాసంగా తీయగాలుగుతున్నారు.
భారతీయుడా ఈ మహమ్మారిని మన దేశం నుండి తరిమి కొడదాం.
దయ చేసి సహకరించండి..... ప్లిజ్ 

No comments:

Post a Comment