Wednesday, November 7, 2012

మాతృమూర్తి నీకు జోహారు.....


చీకటే నిను కమ్మినా వెలుగు చూపించావులే..
కాలమే కాటేసినా దారి చూపించావులే..
ఎదుట ఉన్నట్టే నువ్వు ఉంటావు...
మరచిపొలేని గురుతు నీదేలే...
ఓ నేస్తమా....మా ప్రాణమా!!!
ఎంత కాదన్నా నిన్నే మరవలేమమ్మా...
నీ జ్ఞాపకాలన్ని తలిచేము...గుండెలోతుల్లొ నిన్నే దాచుకున్నాము..
నీ గుడిగా మలిచాము మా హృదయం....
నువ్వు లేకుంటే మాకు తొడు ఎవరమ్మా...
నువ్వు రాకుంటే ఈ పాదం కదలదమ్మా...
స్నేహామా..చేరుమా...నీకిదే న్యాయమా???
అమర జ్యొతిగా మారినా మాతృమూర్తి నీకు జోహారు.....
నిన్ను తలచుకుంటే కంటి నిండా పొంగే కన్నీళ్ళు..
నువ్వు పుట్టినా నీఊరు నిను తలచి  ఏడ్చింది...
నువ్వువస్తావని పగటికలలేన్నో చెప్పింది..
వినరావా...కనరావా...
స్నేహామా..చేరుమా...నీకిదే న్యాయమా???

No comments:

Post a Comment