Monday, November 26, 2012

వాన చిత్రంలోని డైలాగ్‌

వాన చిత్రంలోని ఈ డైలాగ్‌ చూసిన ప్రతి ప్రేమికుడి గుండెలోంచి పుట్టేవే.

వర్షం పడుతూ ఉంటుంది. చెరువు ఒడ్డున అభి బాటల్‌ ఎత్తి దింపి వెనక్కి తిరిగి చూడగానే.. నందిని. తర్వాత నందినిని చూసి
అభి : తాగితే అందంగా ఉన్నావ్‌.
నందిని : నేనేం తాగలేదు
అభి : నువ్వ కాదు నేను తాగితే
నందిని : సరె పదా టైమ్‌ అయ్యింది.
అభి : టైమా? టైమ్‌ ఒక పెద్ద 420. నిన్ను చూడగానే నా టైమ్‌ బాగుందనుకున్న. నువ్వు నాతో ప్రేమలో పడే టైమ్‌ వస్తుందనుకున్న. నీతో పెళ్లయి డజన్‌ మంది పిల్లల్ని కనే టైమ్‌ వస్తుందనుకున్న. రాలా.
నువ్వు నన్ను గట్టిగా హత్తుకుని ఈ లోకంలో నువ్వు తప్పా నాకెవ్వరు లేరని చెప్పె టైమ్‌ వస్తుందనుకున్నా. రాలా.
ఎవర్ని తిట్టాలి. ఆయన్నా.. (ఆకాశం వైపు చూస్తూ) పాపం ఆయన చేసిన తప్పేం ఉంది. నన్ను తీసుకెళ్ళి బాగా డబ్బున్న ఇంట్లో పడేశాడు. ఏ నేనుకూడా మా నాన్నలాగే డబ్బునే ప్రేమించొచ్చుకదా? నిన్నే ఎందుకు ప్రేమించాలి. ప్రేమించాను ఏమయ్యింది. నిన్ను చూడగానే డమాలునా బురద గుంటలో పడ్డా. అంటే ప్రేమనే గోతిలో పడ్డావు జాగ్రత్తరా అన్నాడు దేవుడు. వినాలిగా విన్లా .. అయినా వెదికా కనిపడ్దావ్‌ మాయమయ్యావ్‌. కనపడ్డావ్‌ మాయమయ్యావ్‌. అంత దేవుడు కల్లో కనిపించకుండానే చెప్పేసాడు. ఒరే ఈ పిల్ల నీ జీవితంలో మెరుపులా మాయమయ్యేదే కానీ చినుకులా నీ ఇంట్లో ఉండేది కాదురా అని.
తప్పెవరిది...నాది. ఏం చేయాలి? మర్చిపోవాలీ.
చేస్కో పెళ్లి చేస్కో..కాపురం చేస్కో పిల్లల్ని కను కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నా
ఈ లోకంలో నేను ప్రేమించినంతగా నిన్ను మరెవ్వరూ ప్రేమించలేరు.
నువ్వెక్కడున్నా.. ఎలాఉన్నా.. శ్హనన్ను మర్చిపోయినా.. ముసల్దానివై పోయినా. చచ్చి పోయినా.. నీమీద నా ప్రేమ చావదు. (బాటిల్‌ వైపు చూస్తూ) ఖాలీయే. కానీ ఇక్కడ ఖాలీగా లేదు (హృదయం).
నీ నవ్వు..నీ అందం నీ సిగ్గు నీ వయసు ఈ గజ్జల శబ్దం ఆ వాచీ..ఆ రాస్కెల్‌ దేవదాస్‌గాడి గంటె శ బ్ధం ..అన్నీ మిక్స్‌ అయ్యి నన్నురిపేర్‌ చేయలేనంతగా గాయం చేసి బాధ పెడుతున్నాయి.
బ్రతికేస్తా..అయినా బ్రతికేస్తాను.
నీతో గడిపిన ఈ నాలుగు రోజులు చాలు నాకు
ఆ జ్ఞాపకాలతో మిగిలిన జీవితం గడిపేస్తాను.
(కార్‌లో ఉన్న తన పెంపుడు కుందేలు వైపు చూస్తూ) రేయ్‌ దావదాసు, పదరా టైమ్‌ అయ్యిందటా ( ఇందలోనే అభి నీళ్లలో జారి కింద పడతాడు. వెంటనే నందిని చేయి అందిస్తుంది)
అభి : వద్దులే..వద్దులే.. ఒక్కసారి చేయిస్తేనే ఇంత వరకు వచ్చింది. ఇంకోసారి ఏమౌతుందో. వద్దులే ( గొడుకు పడుతుంది నందిని)
అభి : నిండా తడిసినోడికి గొడుగుపడుతున్నావా.. వద్దులేమ్మా. వెళ్లమ్మా వెళ్లు.
 
ఈ వానలో నను తడవని..ఈ వానలో నను తడవని
ఈ వానలో నను తడవని..

No comments:

Post a Comment