యుగాలేన్ని సాగినా ఆగదు ఈ మృత్యుకేళీ ...
మగువను విషనాగై మింగే వైకుంటపాళీ ....
కరుణలేని సమాజాన తరునికేది స్థానం ..
అడుగు కదపనివ్వని బడభాగ్ని పంజరం ....
తల్లి కడుపు నుంచే వెంట తెచ్చుకుంది ఆడపిల్ల అర్ధంతరపు మరణ శాసనం ...
అతివకు చితిమంటలే అత్తిల్లవుతున్నా నరలోకం నరకులకే నట్టిల్లవుతున్నా ....
నీవు కూడా స్త్రీ వేగా నేలమ్మా....సహనం చాలించి పగిలిపోవమ్మా...
నాటి ఒక్క సితతో ఆగలేదు జ్వాలలు నేటి వరకు సమిధలే కోటి కోటి సితలు ...
ఎపుడు పుడతాడో మరో వాల్మికి .....
ఎపుడు మారుస్తాడో ఈ నీతి .....

No comments:
Post a Comment