Saturday, November 17, 2012

కవిత్వమూ,...ఓ సందేహమె......

రాసేదంతా కవిత్యమేనా?
అని సందేహమెందుకు,....
కాకపోనూవచ్చు, భయమెందకు మిత్రమా......
ఉబికి వచ్చే అక్షరాన్ని,
గొంతు నులిపి , అనుమానంతో,
అనవసరంగా, చంపడం ఎందుకు,
తరువాత తీరిగ్గా,
ఏడవడమూ ఎందుకు.,..


భావాలతో అక్షరాలకు,
లంకె కుదరక, కనెక్టివిటి కోసం,
గిలగిలలాడుతున్నావా,
అదే ఓ కవి జననమని గుర్తుంచుకో నేస్తమా...

బొడ్డుడని బిడ్డ బాధ,
ఏ ఎదిగినోడికీ అర్థమూ కాదు,
తలనెరిసినవాడి తాత్వికత,
పురిటి కంపుని ఆపనూలేదు.
దేనికవే సమాంతరాలు,
అటునుంచి ఇటు దూకేదాక,.


కళ్లూ చెవులే కాదు,
ఇక్కడ పనిచేయాల్సింది,
నిన్ను నీవు తెరుచుకొని,
లోపలి అగాధాలలో అన్వేషించుకో,

నిర్భయంగా అక్షరమైపో,
అజరమరామై మిగలడానికి,
నిలకడగా రాసుకుపో,
నువ్వు నువ్వుగా నిలబడటానికి,
అది చాలు కవిత్వానికి,


ఇక వ్యాఖ్యలంటావా,,
పైకి లాగే వాడే పామై కరవావచ్చు,
క్రిందికి నెట్టెవాడే, నిచ్చనై మిగలావచ్చు.

కవిగా మిగుల్తావో,
కనుమరుగైపోతావో,
అది మరో పార్శ్వం,
కొద్ది మందికి మాత్రమే సాధ్యమయ్యే గొప్ప కళ,
కవిగా మిగలడమూ, వెలగడమే ....

No comments:

Post a Comment