Tuesday, January 1, 2013

Cheli...........

నిన్ను చుసిన తొలి క్షణం ...........నా మనసులో అలజడి రేగింది..
నా హృదయ సడి పెరిగింది....
కన్నుల్లో నిండిన నీ రూపం గుండెల్లో హత్తుకుపోయింది...
నీ పరిచయంతో..అలజడి రేగిన నా మనసు నీ విరహంతో కలవరపడి..
తరచూ నా కనులకు నిన్నే గుర్తు చేస్తోంది....
నీ తలపులతోనే గడిపేస్తున్న నా మనసు అనుక్షణం నీ గురించే ఆలోచిస్తూ ఎద
నిండా నీ జ్ఞాపకాలనే నింపేసింది....
నీ జ్ఞాపకాలతో నిండిన నా మనసు నా కనులు చూసే ప్రతి దృశ్యం నువ్వే అంటోంది..
మనసులో నీ రూపం నిండిపోయింది..మనసే నీలా మారిపోయింది....
నీతో మాట్లాడే ప్రతి క్షణం నాకు ఓ వెన్నెల రాత్రి ....
నీ సానిత్యం లో ప్రతి రోజు నాకు ఓ నవ వసంతం..
నీకై నా మనసు చూపే తపనను .. చేసే ఆరాధనను..చూపే ఆలంబనను ..నీ మనసు
స్నేహమంటోంది...నా మనసేమో నాకే అర్థం కాకుంది..
బంధం ఏదైనా ఈ బాంధవ్యం చేరిగిపోకుడదని నా మనసు కోరుకుంటోంది..
కాని పాక్షికంగా కొంత సమయం నిను వీడినా కలవరపడే నా హృదయం
..శాశ్వుతంగా..నిను వీడే క్షణం లో ఎమవ్తుదో అని భయమేస్తోంది...
అది తలచుకుంటేనే గుండె బరువెక్కుతోంది..
ఇదంతా..ప్రేమని నువ్వు నమ్మితే ఈ జీవితం నీకు అర్పిస్తా....
కాదు స్నేహం అని నికనిపిస్తే..ఓ మంచి స్నేహితుడిగా మిగిలిపోతా.....

No comments:

Post a Comment