Saturday, January 5, 2013

నువ్వు లేని నా జన్మ వ్యర్ధం ...

 నువ్వు లేక నాకు కన్నీరే  మిగిలింది నా ప్రియ నేస్తామా ??? నువ్వు లేని నా జన్మ వ్యర్ధం ...
నీ ఊహల్లో నను జీవించెలా చేసావు !!!!నీ రూపం నన్ను వదలడం లేదు  నా ప్రాణసఖి !!!
ఈ పిచ్చి మనసు కోసం ఒక్కసారైనా నీ మాట వినపడేలా చేయవా .....
మన ప్రేమ కోసం ఈ బంధాలన్నీ తెంచుకొని ఎలా రాగాలను !!!!
కన్నా వాళ్ళు వద్దని కులం ,మతం అనే చీడల నుండి వాళ్ళని విముక్తి చేయాలి అంటే వినవే ???
మన ప్రేమను నమ్ముకున్నాం కాబట్టి మనం ఇంకా బ్రతికే ఉన్నాము అది గుర్తు పెట్టుకో !!!
మన ఆశల రెక్కలన్ని అడుగంటి పోయాయి ..పగలు కూడా చీకటి గానే ఉంది ప్రియా????
నా మనసు లో ఉన్న భాధ తీరదు ...పెదవి దాటి ఒక్క మాట కూడా రావడం లేదు ???
నీవు లేకుండా నా ప్రాణం ఉండదు ....కలలో కట్టుకున్న మేడలు అన్ని కూలిపోయాయి ......
నిన్ను చూసే చివరి చూపు కోసమైనా నా శ్వాస ఆగకుండా అడ్డు పడగలను !!!
ఈ  తీరని వేదన ప్రళయమై నన్ను ముంచేత్తే లోగా నను చేరవా ప్రియతమా !!!
నిన్ను చూడలేని నా జన్మ వ్యర్ధం ప్రియ ????

No comments:

Post a Comment