Thursday, January 3, 2013

నా కోసం రావా ప్రియతమా ????

కాలం చూసావా ప్రియతమా మనల్ని ఎలా దూరం చేసిందో ...
నీ జ్ఞాపకం నన్ను అనుక్షణం వెంటాడుతుంది ....
కల కరిగి నా కళ్ళలో జడివానై కన్నీరులా కారుతుంది ......
రోజు నేను నడిచే దారి కూడా నీ అడుగు జాడ  లేక నా అడుగు కూడా పడటం లేదు .........
నువ్వు నేను ఒక్కటైనాం కాని ఇవాళ నువ్వు నా నుండి దూరంగా వెళ్ళిపో అంటున్నావు .....
నేను అస్సలు అనుకోలేదు నువ్వు లేని నన్ను చూస్తానని ......
నేను రోజు కల కంటాను నీ కనుల కాంతి కనపడుతుందని .........
నీ నీడ (జాడ) ఏదని చిరుగాలి కూడా  అడిగింది .........
నీ మనసు ఎక్కడ అని .....
నేను ఏమని చెప్పను ....
నా హృదయంలో నిప్పుల జ్వాలలు రేపి వెళ్ళావని చెప్పనా ....
నువ్వు లేని నీ ఊహ ని గుండె ఎలా తట్టుకుంటుందో చెప్పన
ఈ ప్రపంచమ్ అంత మనదే అనుకున్నా , అంతం లేని ప్రేమ మనదే అనుకున్నా ?????
కానీ ఇంతలోనే ఇలా విరహ జ్వాలని రగిల్చి వెల్లిపోతవనుకోలేదు ........
నీ తోనే నా ప్రేమ అనుకోవడం నేరమా???
ప్రేమంటే నీకు చితి మంటలు రగిల్చే పరిహాసమా ప్రియా ????
ప్రేమ అనే పదంలో మనం రెండు అక్షరాలూ అనుకున్నాం...........
నా ప్రాణం పోయే లోగ నా కోసం రావా ప్రియతమా ????

No comments:

Post a Comment