Saturday, January 19, 2013

ఒంటరిగా మిగిలిన ప్రేమ...

హృదయములు కలిపిన ప్రేమ ఒంటరిగా మిగిలిన తనమా 
మరపురాని మాట ప్రేమ కలయికొక కల అనుకొనుమా 
జరిగినది కధ అనుకొనుమా అదుపు రానీ ఆట ప్రేమ 
గడిచినది గతమా ఓ ప్రేమ నువ్వు దూరమా 
జరిగినది నిజమా ఓ ప్రేమ జత నీవు కావమ్మా 
ప్రేమ నా నేరమా నీవు ఆ కారణమా 
శాపమా ,పాపమా  కళ్ళలో శోకమా ..!
ప్రియతమా దూరమా దరి చేరు ప్రాణమా 
ఓ చిలిపి తనమా కలవరమా నను చేరుమా ...?
అనుకోని వరమా తోలి ప్రేమ నను వీడి వెళ్లకుమా ...
మాటలే మౌనమా లోకమే శూన్యమా 
ప్రణయమా ప్రళయమా నా మీద కోపమా 
మాయనీ రూపమా కమ్మనీ కావ్యమా 
మనసులో దాగుమా మృదువైన భావమా 
నా లోని సగమా ఎద వినుమా ఒడి చేరుమా 
నువ్వు లేని జన్మ లేదమ్మా .......

No comments:

Post a Comment